బాలీవుడ్ దర్శకుడు నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న కాఫీ విత్ కరణ్ టాక్ షోలో ప్రస్తుతం ఏడవ సీజన్ ప్రసారమవుతుంది.ఈ కార్యక్రమం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.
ఇకపోతే ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.అలాగే సమంత కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం తన విడాకుల గురించి నాగచైతన్య గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తాజాగా ఈ కార్యక్రమంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా విజయ్ దేవరకొండ నటి అనన్య పాండేతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఎప్పటిలాగే కరణ్ తన ప్రశ్నలతో విజయ్ దేవరకొండను సైతం ఉక్కిరిబిక్కిరి చేశారు.
నీకు చీజ్ అంటే ఇష్టమా అని ప్రశ్నించగా.ఈ ప్రశ్న విన్న విజయ్ దేవరకొండ ఇది ఎక్కడికి దారి తీస్తుందో అంటూ నవ్వేశారు.
అనంతరం కరణ్ విజయ్ కు బోల్డ్ ప్రశ్న వేశారు.

లాస్ట్ టైం ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నారు అంటూ ప్రశ్నించారు.ఇలా కరణ్ ప్రశ్న వేయగా వెంటనే విజయ్ స్పందిస్తున్న నో వెంటనే ఈ ప్రశ్న రద్దు చేయండి అంటూ సమాధానం చెప్పారు.విజయ్ దేవరకొండ ఈ విధంగా సమాధానం చెప్పడంతో వెంటనే అనన్య పాండే స్పందిస్తూ ఈరోజు ఉదయం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈరోజు ఉదయం విజయ్ వ్యాయామం చేశారు అంటూ ఈమె సమాధానం చెప్పారు.ఇక కరణ్ సైతం ఈరోజు ఉదయమా అంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.







