పాటపాడిన యువకుడు.. ఎగిరి తన్నిన ఆవు

కొందరు యువకులు భిన్నంగా ఉంటారు.సరాదా సరదాగా ఆడుతూ పాడుతూ గడిపేస్తుంటారు.

 The Young Man Who Sang The Cow That Flew And Kicked , Man , Singing, Song, Viral-TeluguStop.com

వారు చేసే చిలిపి పనులు కొన్ని సార్లు ప్రాణాల మీదకు తెస్తుంటాయి.మనుషులైతే చెప్పింది అర్థం చేసుకుంటారు.

అయితే జంతువులతో వెకిలి వేషాలు వేస్తే అది తిప్పి కొట్టే ప్రమాదం ఉంది.ఇలా ఆకతాయి పనులు చేసే వారు జంతువుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి.

తాజాగా సోషల్ మీడియాలో ఇదే తరహాలోని ఓ వీడియో బాగా వైరల్ అయింది.ఓ ఆవు వద్దకు వెళ్లిన యువకుడు పాట పాడి హుషారుగా కనిపించాడు.

అయితే అది ఎగిరి తన్నడంతో వెనక్కి పడ్డాడు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

సోషల్ మీడియా విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు మనకు దర్శనమిస్తున్నాయి.అందులో కొన్ని ఫన్నీ వీడియోలు బాగా నవ్విస్తున్నాయి.ఇటీవల Alphatoonist అనే ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.ఆ వీడియోలో ఓ యువకుడు హుషారుగా తనకు వచ్చిన పాటను పాడుకుంటూ వెళ్తున్నాడు.

ఓ చోట వరుసగా ఆవులు పడుకుని కనిపించాయి.అందులో మొదటి ఆవు వద్ద పాట పాడాడు.

అది అతడిని ఏమీ చేయలేదు.మరో రెండు అడుగులు ముందుకు వేసి మరో ఆవు వద్ద కూడా తనదైన శైలిలో హుషారుగా పాట పాడాడు.

దానిని ప్రేమగా హత్తుకున్నాడు.దీంతో ఒక్కసారిగా కంగారు పడిన ఆ ఆవు సదరు యువకుడిని తన్నింది.

దీంతో ఆ యువకుడు ఎగిరి అంతెత్తున పడ్డాడు.ఈ వీడియోను చూసిన వారంతా నవ్వకుండా ఉండలేకపోతున్నారు.

అతడికి తగిన శాస్తి జరిగిందని కామెంట్లు పెడుతున్నారు.ఇప్పటికైనా వెకిలి వేషాలు మానుకోవాలని సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube