యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏ ప్రాజెక్ట్ లో నటించినా ఆ ప్రాజెక్ట్ హిట్ అయ్యేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ఖాతాలో 1000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమా నిలిచింది.
అయితే ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ మాత్రం అంతకంతకూ ఆలస్యమవుతోంది.కొరటాల శివ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉన్నా కొరటాలను ఇతర సమస్యలు చుట్టుముట్టడంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతోంది.
ఈరోజు ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ పుట్టినరోజు కావడం గమనార్హం.పుట్టినరోజు సందర్భంగా అభయ్ రామ్ కు సంబంధించిన ఏదైనా ఫోటో వస్తుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరుగుతోంది.
గతంలో పుట్టినరోజు సందర్భంగా కొడుకుల ఫోటోను షేర్ చేయని తారక్ ఈసారి కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నారు.ఎన్టీఆర్ కనీసం ఒక ఫోటో షేర్ చేసినా బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొడుకుల విషయంలో తారక్ ప్రైవసీని కోరుకోవడంలో తప్పు లేదని అయితే అదే సమయంలో ఫ్యాన్స్ ను హర్ట్ చేయడం కరెక్ట్ కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు తారక్ తన సినిమాలకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తారక్ రెమ్యునరేషన్ సైతం భారీగా పెరిగిందని తెలుస్తోంది.అయితే ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు తారక్ సొంత బ్యానర్ లోనే తెరకెక్కనున్నాయి.

అయితే కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను తారక్ వేగంగానే పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.ఫ్యాన్స్ తారక్ సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో తారక్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది.తారక్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
సినిమాసినిమాకు తారక్ రేంజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.







