అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా థ్యాంక్యూ.దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు.
సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా ఉండనుంది.జూలై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ ఫ్యాన్స్ ని అలరిస్తుంది.
త్యాంక్యూ సినిమాలో నాగ చైతన్య సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.సినిమాలో మహేఏష్ వీరాభిమానిగ చైతు కనిపించనున్నాడు.
అందుకే ఈ సినిమాలో మహేష్ ప్రస్తావన చాలా చోట్ల వస్తుందని అంటున్నారు.థ్యాంక్యూ సినిమాలో మహేష్ నటించిన ఒక్కడు ఇంకా బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి.సెన్సేషనల్ హిట్ మూవీ దూకుడు.ఈ 3 సినిమాల ప్రస్తావన ఉంటుందని తెలుస్తుంది.
సినిమాలో స్ట్రైట్ హీరో నాగ చైతన్య కాగా ఈ సినిమాకు మహేష్ కూడా వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ గా ఉంటాడని అంటున్నారు.అక్కినేని ఫ్యామిలీ లెగసీ నుంచి హీరోగా చేస్తున్న నాగ చైతన్య మరో హీరో ఫ్యాన్ గా నటించడం అంటే మాములు విషయం కాదు.
అయితే అది కూడా చాలా యాక్సెప్ట్ చేసేలా డైరక్టర్ డిజైన్ చేశారట.

ఇక థ్యాంక్యూ సినిమాలో నాగ చైతన్య 3 వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది.సినిమాలో రాశి ఖన్నాతో పాటుగా మాళవిక నాయర్, అవికా గోర్ లు కూడా నటిస్తున్నారు.సినిమా రిజల్ట్ మీద నాగ చైతన్య చాలా నమ్మకంగా ఉన్నారు.
ఈ సినిమాలో నటించి నటుడిగా తనని తాను చాలా మార్చుకున్నానని అన్నారు నాగ చైతన్య. విక్రం కుమార్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించారని తెలుస్తుంది.
మరి నాగ చైతన్య థ్యాంక్యూ ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో మరో నాలుగు రోజుల్లో తెలుస్తుంది.







