జుట్టు నెరిసిన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే!

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు రూటు మార్చారు.జుట్టు నెరిసిన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు.

 Chiranjeevi Balakrishna Venkatesh Salt And Pepper Look Details, Chiranjeevi ,bal-TeluguStop.com

క్లాస్ రోల్స్ లో నటించినా మాస్ రోల్స్ లో నటించినా లుక్ కొత్తగా ఉండేలా హీరోలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

లూసిఫర్ సినిమాకు రీమేక్ గా మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో చిరంజీవి నెరిసిన జుట్టులో కనిపిస్తున్నారు.

అయితే తన లుక్ స్టైలిష్ గా ఉండే విధంగా చిరంజీవి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరో స్టార్ హీరో బాలకృష్ణ కథకు అనుగుణంగా లుక్ ను మార్చుకునే విషయంలో ముందువరసలో ఉండే హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే.

అఖండ మూవీలో అఘోరా పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించిన బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించనున్నారు.

Telugu Balakrishna, Chiranjeevi, Chiranjeevi God, Rana Web, Salt Pepper, Tollywo

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలో సైతం బాలయ్య 50 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు.

Telugu Balakrishna, Chiranjeevi, Chiranjeevi God, Rana Web, Salt Pepper, Tollywo

మరో స్టార్ హీరో వెంకటేష్ రానా నాయుడు వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. రే డొనోవన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.ఈ క్రైమ్ సిరీస్ కోసం వెంకటేష్ తన లుక్ ను పూర్తిస్థాయిలో మార్చుకున్నారు.నెరిసిన జుట్టులో కూడా స్టైలిష్ గా కనిపిస్తూ వెంకటేష్ అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నారు.

నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube