సాంకేతిక రంగం రోజురోజుకు పెరిగిపోతోంది.టెక్నాలజీ రోజురోజుకు సరికొత్త పుంతలు తొక్కుతోంది.
చాలా వేగంగా సాంకేతిక రంగం డెవలవ్ అవుతోంది.సెకన్లలో పనులన్నీ జరిగిపోతున్నాయి.
ఏ పని అయినా సరే మన చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారా సలువుగా చేసుకునే వెసులుబాటు వచ్చింది.ఇంటి దగ్గర కూర్చోనే అన్ని పనులు చేసుకుంటున్నారు.
అన్ని రంగాల్లోకి టెక్రాలజీ చొచ్చుకోచ్చింది.ఏ పనిచేయాలన్నా సరే ఆన్ లైన్ సౌకర్యం అనేది తప్పనిసరిగా మారింది.
అయితే ఆర్టిపీషియల్ టెక్నాలజీ వల్ల టెక్నాలజీ మరింత పెరిగింది.ఈ టెక్నాలజీ వల్ల మనుషుల చేసే పనులు తగ్గిపోయాయి.మనుషులు చేసే పనులను ఈ టెక్నాలజీ ద్వారా మెషిన్లు చేసేస్తున్నాయి.దీని వల్ల రోబో టెక్నాలజీ మరింత విస్తరించింది.
మనుషులు చేసే పనులన్నీ రోబోలు చేస్తున్నాయి.మనుషుల కంటే రెట్టింపు వేగంతో చ్చితత్వంతో రోబోలు పనులు చేస్తున్నాయి.
ఈ క్రమంలో గ్లాస్గో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త విషయాన్ని బయటపెట్టారు.రాబోయే రోజుల్లో రంగులను కూడా రోబోలు గుర్తించగలవనే విషయాన్ని సైంటిస్టులు బయటపెట్టారు.కళ్ల ద్వారా రోబోలో రంగులను గుర్తించగలవని తెలిపారు. లైట్ రేంజెస్ గుర్తించే ఎలక్ట్రానిక్ చర్మాన్ని గ్లాస్గో యూనివర్సిటీ సైంటిస్టులు డెవలప్ చేశారు.
పెక్సిబుల్ ప్లాస్టిక్ మెటీరియల్ పై చిన్న సెమీకండక్టర్స్ తో తయారుచేసి ఈ స్కిన్ ను ఇంజినీర్లు సర్పేస్ వర్తంపచేస్తున్నారు.

ఈ టెక్నాలజీ ద్వారా రోబోలు రంగులను గుర్తించగలవని సైంటిస్టులు స్పష్టం చేశారు.ఈ స్కిన్ కాంతిని కొలిచేందుకు కేవలం 2.5 మిల్లీ సెకన్లు పడుతుందన్నారు.అతినీలలోహిత్ నుంచి ఇన్ ప్రారెడ్ వరకు అన్ని కాంతులను గుర్తిస్తుందని చెప్పారు.వైర్ లెస్ కమ్యూనికేషన్ టెక్ లో కూడా దీనిని గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.







