మన చిన్నతనంలో పంచతంత్ర కథలు పుస్తకాలను చదివే ఉంటాం.ఆ కథలను కూడా విని ఉంటాం.
అయితే పంచతంత్ర కథలు అన్న పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అందులో నీతి.అటువంటి కథల ఇన్స్పిరేషన్ ఆధారంగా తెరకెక్కిన ఆంథాలజీ చిత్రం పంచతంత్ర కథలు.
గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ వ్యాపారవేత్త డి.మధు నిర్మించారు.
ఇందులో నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ ముఖ్య పాత్రల్లో నటించారు.ఇది ఇలా ఉంటే తాజాగా వీడియోలైనా ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.సినిమా కథ ఏమిటి? అందులో నీతి ఏమిటి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కథ:
ఇందులో దర్శకుడు మొదట కులాలపై ఫోకస్ చేశాడు.ఊరిలో కుల వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది.కుల పట్టింపులు ఏ విధంగా ఉంటాయో చక్కగా చూపించాడు.అయితే ప్రేమకు కులం అడ్డు వస్తుంది అన్న అంశాన్ని ఇప్పటివరకు చాలా సినిమాల్లో చూసాం.కానీ ఆ సినిమాలకు మాత్రం ఇది కాస్త భిన్నంగా ఉంటుంది అని చెప్పవచ్చు.
ఇందులో ప్రతి ఒక కులానికి కూడా ప్రాముఖ్యత ఉంది అని తెలిపారు.మొత్తంగా అన్ని కులాలు కలిసి ఉంటేనే ఒక ఊరు అవుతుంది అన్న విధంగా తెలిపారు.
ఇక ఇందులో కృష్ణ అనే వ్యక్తి కటింగ్ షాప్ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటాడు.అతను ఆ ఊరి పెద్ద ఇంటి అమ్మాయి సత్యను ప్రేమిస్తాడు.
అలా వారిద్దరూ ప్రేమించుకున్న తర్వాత వారి ప్రేమకు కొందరు వ్యతిరేకంగా కొందరు మాత్రం మద్దతు ఇస్తారు.అలా ఆ ప్రేమికులిద్దరూ ఊర్లో అందరితో పోట్లాడి చివరికి మనుషులు ముఖ్యం.
కులాలు కావు అన్నది నిరూపిస్తారు.

నటీనటుల నటన:
ఇక ఇందులో కృష్ణ పాత్రలో నటించిన నిహాల్, సత్య పాత్రలో నటించిన సాదియాల నటన అందరినీ ఆకట్టుకుంది.అంతేకాకుండా ఇద్దరు కలిసి మోతెవరి అనే పాటలో ఫుల్ ఎనర్జీటిక్ గా చిందులు వేశారు.సాదియా అయితే తన అందం అభినయంతో అందరినీ కట్టి పడేసింది.

టెక్నికల్:
ఇందులో సన్నివేశాలకు తగ్గట్టుగా పాటలు నేపథ్య సంగీతం బాగా సాగింది.సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.ఎడిటింగ్ నిర్మాణ విలువలు కూడా అన్ని చక్కగా కుదిరాయి.
విశ్లేషణ:
ఊరి వాతావరణం లో తెరకెక్కించిన మొదటి రెండు ఎపిసోడ్ లు కూడా ఎంతో ఎమోషనల్ గా సాగాయి.ఆ తర్వాత సిటీ వాతావరణం లో కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది.ఆ తర్వాత చివరిగా భాగం గీతా భాస్కర్ అందరినీ ఆలోచింపజేసేలా చేస్తుంది.







