సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎంచుకునే ప్రాజెక్ట్ లలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే కెరీర్ పరంగా ఎదిగే అవకాశం ఉంటుంది.రెమ్యునరేషన్ కంటే మంచి కథలకు హీరోయిన్లు ప్రాధాన్యత ఇస్తే మాత్రమే కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు.
అలా కాకుండా కథల విషయంలో తప్పులు చేస్తే మాత్రం కెరీర్ పరంగా ఇబ్బందులు పడక తప్పదు.అయితే తెలుగులో పూజా హెగ్డే రిజెక్ట్ చేసిన సినిమాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.
ఈ సినిమాలు చేసి ఉంటే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజా హెగ్డే రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కొన్ని సందర్భాల్లో డేట్లను కేటాయించలేక స్టార్ హీరోల సినిమాలను సైతం పూజా హెగ్డే రిజెక్ట్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి.
పూజా హెగ్డే రిజెక్ట్ చేసిన సినిమాలో వకీల్ సాబ్ ఒకటి.ఈ సినిమాలో శృతి హాసన్ నటించిన పాత్రలో నటించే అవకాశం మొదట పూజా హెగ్డేకు వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆమె ఈ అవకాశాన్ని వదులుకున్నారని సమాచారం అందుతోంది.

నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో అంధాధూన్ రీమేక్ గా తెరకెక్కిన మాస్ట్రో సినిమాలో తమన్నా పోషించిన పాత్రలో నటించే అవకాశం పూజా హెగ్డేకు రాగా కొన్ని కారణాల వల్ల పూజా హెగ్డే ఆ అవకాశాన్ని వదులుకున్నారు.ఛత్రపతి హిందీ రీమేక్, అల్లుడు అదుర్స్, శాకుంతలం, హిందీ హీరో, గుడ్ బై, హిందీ అటాక్ సినిమాలలో పూజా హెగ్డే ఛాన్స్ వస్తే వదులుకున్నారని సమాచారం.

పూజా హెగ్డే రిజెక్ట్ చేసిన సినిమాలలో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిస్తే మరికొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.పూజా హెగ్డే స్టార్ హీరోల సినిమాలను రిజెక్ట్ చేయడం మాత్రం కొన్ని సందర్భాల్లో ఆమె అభిమానులకు కూడా నచ్చలేదు.పూజా హెగ్డే తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







