మన టాలీవుడ్ హీరోలు ఇప్పటి వరకు స్పై ఆపరేషన్ కు సంబంధించి సినిమాలు చేయలేదు.అయితే బాలీవుడ్, హాలీవుడ్ లో ఈ నేపథ్యంలో పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి.
ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి.అయితే మన హీరోలు మాత్రం అలాంటి నేపథ్యంలో సినిమాలు ఇప్పుడిప్పుడే చేస్తున్నారు.
స్పై ఆపరేషన్ పై ఇప్పుడిప్పుడే గాలి మళ్లడంతో ఆ నేపథ్యంలో వరుస సినిమాలు చేస్తున్నారు.అప్పుడప్పుడు ఒకటి అరా సినిమాలు వచ్చిన ఇటీవల యంగ్ హీరో అడవి శేష్ గూఢచారి సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ కోవకు చెందిన సినిమాలు చేస్తున్నారు.
మరి ఇప్పుడు రాబోతున్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
ఏజెంట్.
యంగ్ హీరో అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు.అఖిల్ ఈ సినిమాలో ఊర మాస్ లుక్ లో కనిపించ బోతున్నాడు.
ఇందులో అఖిల్ స్పై ఏజెంట్ గా కనిపించనున్నాడు.ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా.
అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు.మలయాళ హీరో మమ్ముట్టి విలన్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా ఆగష్టు 12న రిలీజ్ కాబోతుంది.
ఇక అక్కినేని నాగార్జున కూడా ఈ కోవకు చెందిన సినిమా చేస్తున్నాడు.ప్రెసెంట్ నాగార్జున నటిస్తున్న సినిమాల్లో యాక్షన్ థ్రిల్లర్ ‘ది గోస్ట్’ సినిమా ఒకటి.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇటీవలే వచ్చిన టీజర్ లో నాగ్ క్రూరమైన కిల్లర్ ఏజెంట్ గా కనిపించి ఆకట్టుకున్నాడు.గోస్ట్ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.మెగా కాంపౌండ్ లో కూడా స్పై ఆపరేషన్ నేపథ్యంలో నటించేందుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆసక్తి కనబర్చుతున్నాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.నాగ తో గోస్ట్ తెరకెక్కిస్తున్న ప్రవీణ్ సత్తారు నే వరుణ్ తేజ్ తో కూడా స్పై ఆపరేషన్ నేపథ్యంలో సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఇదే నిజం అయితే మెగా హీరోల్లో ఈ తరహా పాత్రలో నటించబోతున్న మొదటి హీరో ఈయనే అవుతాడు.
ఇలా ఈ హీరోలంతా స్పై ఆపరేషన్ నేపథ్యంలో సినిమాలు చేస్తునాన్రు.ఇక ముందు ముందు మరింత మంది ఈ తరహా పాత్రలలో నటించే అవకాశం ఉంది.







