ప్రపంచంలో ఎన్నో రకాల పుట్టగొడుగులు ఉంటాయి.కొన్ని తినదగినవే అయితే మరికొన్ని విషపూరితమైనవి ఉంటాయి.
ఇవన్నీ ఫంగీ లేదా శిలీంధ్రాల నుంచి ఏర్పడతాయి.అయితే తాజాగా యూకేకి కొత్త అయిన రెండు జాతుల శిలీంధ్రాలు, ఇంతకు ముందు సైన్స్‌కు పరిచయం లేని మరొక శిలీంధ్రం స్కాట్లాండ్‌లోని పర్వత శ్రేణి అయిన కైర్‌న్‌గార్మ్స్‌లో సైంటిస్టులు కనుగొన్నారు.ఇప్పటివరకు ఇలాంటి ఫంగస్ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.
2021లో కైర్‌న్‌గార్మ్స్ నేషనల్ పార్క్‌లో 3 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తయిన 277 కొండల్లో వెతకగా ఇవి కనిపించాయి.ఇక్కడ ఉన్న 55 కొండల నుంచి 219 మట్టి నమూనాలను సేకరించి వాటి నుంచి DNA సేకరించి, పరీక్ష చేశారు జేమ్స్ హట్టన్ ఇన్‌స్టిట్యూట్‌లోని శాస్త్రవేత్తలు.అప్పుడే వారికి వాటిలో 2,748 భిన్న జాతుల శిలీంధ్ర జీవులు కనిపించాయి.
ఈ జాతుల్లో అమనిటా గ్రోయెన్‌లాండికా అనే ఫంగస్ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది.అలానే అక్రోడోంటియం అంటార్కిటికమ్ ఫంగస్ కూడా వారిని ఆశ్చర్యపరిచింది.
ఈ ఫంగస్ అంటార్కిటికాకు చెందినగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ సరికొత్త ఫంగస్ నుంచి ఎలాంటి పుట్టగొడుగులు వస్తాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

దురదృష్టం ఏంటంటే, ఈ రెండు అంతరించిపోతున్న జాతుల్లో ఉన్నాయి.అయితే ఇప్పుడు ఇవి రెండూ కలిసి కనిపించడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు.స్కాట్లాండ్‌లోని కైర్‌న్‌గార్మ్స్ వద్ద ఉండే చల్లటి పరిసరాలు, వాతావరణంలో ఈ ఫంగస్ జీవులు పెరిగేందుకు ఇష్టపడతాయని ఒక స్టడీలో సైంటిస్టులు తెలిపారు.ఇదే మట్టిలో వారు ఇతర శిలీంధ్రాలను ఆక్రమించుకునే స్ట్రాంగ్లర్ ఫంగస్ వంటి చిత్రమైన శిలీంధ్రాలను కనిపెట్టారు.
తాజాగా కనిపెట్టిన రెండు ఫంగస్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రస్తుతం కృషి చేస్తున్నారు.







