షారుఖ్, సల్మాన్ ఖాన్ ఉన్నంతకాలం ఇండస్ట్రీ మునుగుతూనే ఉంటుంది.. డైరెక్టర్!

బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తాజాగా వహించిన సినిమా ది కశ్మీర్ ఫైల్స్.

మొదట ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

అంతేకాకుండా మార్చి 11న విడుదలైన ఈ సినిమా దానంగా 250 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.అంతేకాకుండా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి భారీ వసూళ్లను సాధించింది.

ఈ సినిమా మంచి విజయం సాధించడంతో డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి కి దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది.ఇకపోతే వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం ది ఢిల్లీ ఫైల్స్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.కింగ్స్‌, బాద్‌షాలు, సుల్తాన్‌లు ఉన్నంత కాలం బాలీవుడ్‌ మునిగిపోతూనే ఉంటుంది.

Advertisement

ప్రజల గాథలతో సినిమాలు తీస్తూ ప్రజల పరిశ్రమగా మార్చాలి.అది మాత్రమే ప్రపంచ చలనచిత్ర పరిశ్రమగా అభివృద్ధి చెందుతుంది అంటూ సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్‌ చేశారు వివేక్‌ అగ్నిహోత్రి.

అయితే ఈ ట్వీట్ కింగ్‌ ఖాన్ షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ను పరోక్షంగా విమర్శించినట్లు తెలుస్తోంది.

అయితే కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో సుమారుగా రెండేళ్లు సినీ ఇండస్ట్రీ నష్టాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.దీంతో ఓటీటీలు పుంజుకున్నాయి.ఈ క్రమంలేనే ప్రేక్షకుల అభిరుచి మారింది.

ఈ మార్పుతో హిందీ ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాలను తిరస్కరించి, ఈ నేపథ్యంలోనే ఊరమాస్‌ స్టైల్‌లో వచ్చిన దక్షిణాది చిత్రాలను మాత్రం విపరీతంగా ఆదరించారు.ఇంకా చెప్పాలంటే హిందీ చిత్రాలకంటే దక్షిణాది డబ్బింగ్‌ మూవీస్‌ ఎక్కవ కలెక్షన్లు రాబట్టాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఈ పరిణామంతో బాలీవుడ్ స్టార్స్‌పై విమర్శలు మరింత రాజు కున్నాయి.ఈ క్రమంలోనే వివేక్ అగ్నిహోత్రి ఈ ట్వీట్‌ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు