ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..!!

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి.బీజేపీ పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలు కూడా చాలా సందర్భాలలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు తెలంగాణ బిజెపి నాయకులు రెడీగా ఉండాలని పేర్కొన్న సందర్భాలు ఉన్నాయి.

 Ktr Made Key Comments On Early Elections Details, Bjp, Ktr, Telangana Elections,-TeluguStop.com

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ మరియు తెలంగాణ బిజెపి నేతలు కూడా ముందస్తు ఎన్నికలకు తాము రెడీ అన్నట్టు కామెంట్లు చేశారు.ఇటువంటి తరుణంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు అంటూ వస్తున్న వార్తలకు మంత్రి కేటీఆర్ బ్రేక్ వేసినట్టు వ్యాఖ్యానించారు.

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారము ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.ఇదే సమయంలో ప్రధాని మోడీపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఇప్పటివరకు దేశానికి ప్రధాని అయిన వాళ్ళు 56 లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక్క ప్రధాని మోడీ వంద లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు.

మోడీ వ్యవహార శైలి గుజరాత్ కే ప్రధాని అన్నట్లు వ్యవహరిస్తున్నారని కూడా మండిపడ్డారు.దీంతో కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube