కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమరశంఖం పూనించనున్నారు.విపక్ష పార్టీలను సమన్వయం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయించారు.
దేశంలో ప్రమాదంలో పడుతున్న ఫెడరల్, సెక్యులర్ ప్రజాస్వామిక విలువలను కాపాడాలనే తన ప్రయత్నాలకు మరింత పదును పెట్టనున్నారు.ఆర్థిక సంక్షోభంలోకి దేశాన్ని నెట్టివేస్తున్న కేంద్ర వైఖరిని తేటతెల్లం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని బిజెపి కేంద్ర ప్రభుత్వ దమనీతి పై పోరాటం చేయాలని నిర్ణయించారు.
బిజెపి ప్రభుత్వ అప్రజాస్వామిక దమననీతిని తీవ్రంగా ఖండిస్తూ.
దేశవ్యాప్త నిరసనలతో కేంద్రం అసలు స్వరూపాన్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.దేశంలోని పలు రాష్ట్రాల విపక్ష నేతలతో ఫోన్లో మంతనాలు చేస్తున్నారు.
పలువురు ముఖ్యమంత్రులతో మాట్లాడారు.ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సన్నిహితులతో, బీహార్ ఆర్జెడీ నేత తేజస్వీయాదవ్‌తో , యుపీ ప్రతిపక్షనేత అఖిలేశ్ యాదవ్‌తో, శరద్ పవార్ సహా ఇతర జాతీయ విపక్ష నేతలతో కేసీఆర్ ఫోన్లో స్వయంగా మాట్లాడారు.

కేంద్రం పై ప్రజాస్వామిక పోరాటంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రతిపాదనలకు పలు రాష్ట్రాల విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు సానుకూలంగా స్పందిస్తున్నారు.కేంద్రం మెడలువంచి దేశంలో ప్రజాస్వామిక విలువలను కాపాడే దిశగా అన్ని విపక్ష పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేందుకు కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు.అటు వరదల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మంత్రులు అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తూనే.ఇటు బిజెపి అప్రజాస్వామిక విధానాల విపత్తు నుంచి దేశాన్ని కాపాడేందుకు పార్లమెంట్ వేదికలపై పోరాటానికి సమాయత్తం అవుతున్నారు.
పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని బిజెపి కేంద్ర ప్రభుత్వ దమనీతి పై పోరాటం చేయాలని నిర్ణయించారు.