సముద్రంలోనూ, సముద్ర తీరంలోనూ కనిపించే ఆక్టోపస్‌లు చూడడానికి భయంకరంగా ఉంటాయి.అయితే వాటికి కూడా ప్రత్యేకతలు ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా 300లకు పైగా ఆక్టోపస్‌లు ఉన్నాయి.ప్రతి దానికీ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇలాంటి ఆక్టోపస్ స్పూర్తితో శాస్త్రవేత్తలు ఓ కొత్త ప్రయోగం చేశారు.సాధారణంగా సముద్రంలో ఏదైనా పోగొట్టుకుంటే మనం వదిలేయక తప్పదు.
అయితే స్కూబా డైవర్లు మాత్రం సముద్రం అడుగున ఉన్న ఎన్నో వస్తువులను కష్టపడి పైకి తీసుకొస్తుంటారు.ఇలాంటి సందర్భాలలో వారికి సాధారణ గ్లోవ్స్ ధరించినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది.
అందుకోసం వారికి ఏదైనా ప్రత్యేకంగా తయారు చేయాలని కొందరు శాస్త్రవేత్తలు భావించారు.ఆక్టోపస్ స్పూర్తితో ఆక్టో-గ్లోవ్స్‌కు రూపకల్పన చేశారు.
వీటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
భూమిపైనే కాకుండా సముద్రాలలోనూ ఎన్నో పరిశోధనలు జరుగుతూ ఉంటాయి.
ఇలాంటి సందర్భాలలో ఏదైనా సముద్రంలో పోగొట్టుకుంటే వాటిని తిరిగి పొందడం చాలా కష్టం.దీంతో వర్జీనియా టెక్ పరిశోధకులు సరికొత్త ఆక్టో-గ్లోవ్స్ తయారు చేశారు.
వర్జీనియా టెక్, యూనివర్శిటీ ఆఫ్ నెబ్రాస్కా-లింకన్ పరిశోధకులు ఇటీవలి సైన్స్ అడ్వాన్సెస్ పేపర్‌లో వివరించిన ఆక్టా-గ్లోవ్ గురించి ఎన్నో ప్రత్యేకతలున్నాయని తెలుస్తోంది.

ఈ గ్లోవ్ సమీపంలో వస్తువులు అందుబాటులో ఉన్నాయో లేదో పసిగట్టగలదు.ఇది ఉపరితలంపై గట్టిగా అతుక్కొని విడుదల చేయగల చిన్న సక్కర్‌లను సక్రియం చేయగలదు.ఈ డెక్ అవుట్ గ్లోవ్‌ని ఉపయోగించి, పరిశోధకులు చదునైన, గుండ్రని, దృఢమైన మరియు మృదువైన నీటి అడుగున ఉన్న వస్తువులను-ఒక మెటల్ బొమ్మ, ఒక చెంచా, ఒక హైడ్రోజెల్ బాల్, ఒక ప్లేట్, ఒక పెట్టె మరియు గిన్నె వంటి వస్తువులను తీయగలిగారు.
సక్కర్లు నిర్దిష్ట ఉపరితలాలపై ఎంత గట్టిగా పట్టుకున్నాయో ఈ గ్లోవ్స్ ను పరిశీలించి చూసినప్పుడు తెలిసింది.ఇవి డైవర్లకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.







