సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అన్న తరచుగా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.అయితే అన్నీ ఇండస్ట్రీలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిన వారు ఎందరో ఉన్నారు.
ఇప్పటికే ఎంతో మంది క్యాస్టింగ్ కౌచ్ విషయంలో నోరు విప్పిన విషయం తెలిసిందే.అయితే అలా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిన వారిలో తెలుగు బుల్లితెర నటి సుష్మ కూడా ఒకరు.
కేవలం బుల్లితెర పై సీరియల్స్ లోనే కాకుండా వెండితెర పై సినిమాలలో కూడా నటించింది సుష్మ.అప్పట్లో వచ్చిన కొత్త బంగారులోకం సినిమాలో సుధ.
రాగసుధ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించి ఫేమస్ అయింది నటి సుష్మ.
ఇక ఆ తరువాత ఒకటి రెండు సినిమాల్లో నటించి ఆ తరువాత మళ్ళీ కనిపించలేద.
అయితే చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు మళ్లీ కార్తీకదీపం సీరియల్‌లో స్వప్నగా ఎంట్రీ ఇచ్చింది.అంతకుముందు అభిషేకం, కథలో రాజకుమారి, శివరంజిని, పెళ్లి పుస్తకం వంటి సీరియల్స్‌లో నటించి తన తోటి నటుడు రవి కిరణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
అయితే పెళ్లి తరువాత అటు సినిమాలు ఇటు సీరియల్స్‌కి దూరమైన సుష్మ కార్తీకదీపం సీరియల్‌తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చి అదరగొడుతుంది.అయితే కొత్త బంగారులోకం సినిమా మంచి హిట్ అయిన తరువాత ఆమెకు చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయట.

ఆ క్రమంలోనే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో ఏమిటో అన్న భయం మొదటి నుంచి ఉండేదట.కొత్త బంగారు లోకం సినిమా తరువాత ఆమెకు గోల అనే సినిమా చేసిందట.అయితే అప్పుడే మరో సినిమా ఆఫర్ వచ్చింది.అప్పుడు నన్ను కమిట్‌మెంట్ గురించి అడిగారు.నా పెర్ఫామెన్స్ నచ్చితే మీరు సినిమాలో పెట్టుకోండి లేదంటే లేదు అని చెప్పాను అలా అప్పటి నుంచి నాకు ఏ ప్రాజెక్ట్ వచ్చినా మైండ్‌లో ఇది ఉండిపోయి భయం వేసేది అని తెలిపింది సుష్మ.ఇక అప్పటి నుంచి ఆడిషన్స్‌కి నా ఫ్రెండ్స్‌ని తీసుకుని వెళ్లేదాన్ని.
ఇక గోల సినిమా తరువాత నాకు పెళ్లి అయ్యింది.ఆ తరువాత కొన్ని సినిమాల్లో చేశా ఏవీఎం ప్రొడక్షన్స్‌లో ఎవరైనా ఎప్పుడైనా,హౌస్ ఫుల్ వంటి సినిమాల్లో చిన్న చిన్న సినిమాలు చేశా.
ఆపై నాకు ఎగ్జామ్స్ ఉండటం వల్ల ఆఫర్స్ వచ్చినా సరిగా చేయలేకపోయాను.ఆ తరువాత సీరియల్స్‌లో నాకు బాగా కంఫర్ట్ అనిపించింది.
మంచి మంచి పాత్రలు వచ్చాయి.పెళ్లైన తరువాత సీరియల్స్‌తో బిజీ అయ్యాను అని చెప్పుకొచ్చింది సుష్మ.







