నన్ను మానసికంగా హింసించారు.. హీరోయిన్ మల్లికా శెరావత్ ఆవేదన!

బాలీవుడ్ హీరోయిన్ మల్లికా శెరావత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మల్లికా శెరావత్ తాజాగా నటించిన చిత్రం ఆర్కే.

 Why Mallika Sherawat Compares Deepika Padukone Gehraiyaan Her Murder Movie, Mall-TeluguStop.com

త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న సందర్భంగా ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉంది.

ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇంటర్వ్యూలో మల్లికా శెరావత్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.దీపికా పదుకొణె గెహ్రియాన్‌లో ఏం చేసిందో 15 ఏళ్ల క్రితం మర్డర్‌లో నేనూ అదే చేశాను.

కానీ అప్పుడు జనాల ఆలోచనా స్వభావం ఎంతో సంకుచితంగా ఉండేది. ముద్దు పెట్టడాన్ని, బికినీ వేసుకోవడాన్ని చాలా తప్పుపట్టారు.ఇండస్ట్రీలోని కొంతమంది వ్యక్తులు నన్ను మానసికంగా వేధించారు.కేవలం గ్లామర్‌ ఒలకబోయడం తప్ప నటన రాదని తిట్టిపోశారు అంటూ తన మనసులో బాధను బయట పెట్టేసింది మల్లికా శెరావత్.

కాగా మల్లిక దశావతారం, ప్యార్‌కి సైడ్‌ ఎఫెక్ట్స్‌, వెల్‌కమ్‌ లాంటి సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలో మల్లికను ఎవరు పట్టించుకోలేదు అని ఆమె చెప్పుకొచ్చింది.

Telugu Bollywood, Gehraiyaan-Movie

కాగా ఆర్కే సినిమాలో మల్లికా శెరావత్‌తో పాటు కుబ్ర సైత్‌, రణ్‌వీర్‌ షోరే, మను రిషి చద్ద, చంద్రచూర్‌ రాయ్‌, అభిజీత్‌ దేశ్‌పాండే, అభిషేక్‌ శర్మ, గ్రేస్‌ గిరిధర్‌, వైశాలి మల్హారా తదితరులు నటించారు.ఈ సినిమా జూలై 22న విడుదల కానుంది.కాగా ఆర్కే సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని చిత్ర బంధంతో పాటు అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube