ఏదైనా సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లాలంటే అదే మీ సాధారణ విషయం కాదు సినిమాకి ఒక కథ అనుకోవాలి కథ ప్రకారం ఆ సినిమాకి క్యాస్టింగ్ కూడా పూర్తి చేయాలి.ఆ తర్వాత లొకేషన్స్, బడ్జెట్ వంటి రకరకాల కష్టాలు సినిమాకి ఉంటాయి.
ఒక మ్యూజిక్, ఫైట్స్, పాటలు అంటూ ఎన్నో రకాల కసరత్తులు చేయాల్సి ఉంటుంది ఇన్ని చేశాక కూడా ఆ సినిమా హిట్ అవుతుందా అంటే అది ఖ చెప్పలేం.ఇవన్నీ ఒక ఎత్తు అయితే సినిమాని ఒక అద్భుతమైన టైటిల్ తో ప్రేక్షకులకు అందించడం కూడా అంతే ముఖ్యం సినిమాకి టైటిలే ప్రాణవాయువు లాంటిది.
మరి అలాంటి ముఖ్యమైన టైటిల్ గురించి మేకర్స్ ఎంతో జాగ్రత్తగా ఉంటారు ఆ టైటిల్ లోనే కావలసినంత ఇంట్రెస్ట్ జనాలకి క్రియేట్ చేయడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తూ ఉంటారు.ఈమధ్య చిన్న హీరోలంతా కూడా ఒక రకమైన కొత్త పద్ధతి ఫాలో అవుతున్నారు టైటిల్స్ విషయంలో.
కాస్త సాఫ్ట్ గా పద్ధతిగా టైటిల్స్ పెడుతూ జనాలకి ఇంట్రెస్ట్ కలిగేలా బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు కూడా.
ఇక ఇటీవల చిన్న సినిమాలతో టాలీవుడ్ పై దండయాత్ర చేస్తున్న కిరణ్ అబ్బవరం ఎస్ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే, రాజా వారు రాణి గారు, వినరో భాగ్యము విష్ణు కథ లాంటి సాఫ్ట్ టైటిల్స్ తో ఎక్కువగా జనాలు పై ప్రయోగిస్తున్నాడు.
ఫలితం సంగతి పక్కన పెట్టి పేరుతోనే జనాల్లో మంచి ఆసక్తిని పుట్టిస్తున్నాడు.

ఇక మెగా హీరో వైష్ణవి తేజ్ కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతూ సాఫ్ట్ టైటిల్స్ ని వాడుతున్నాడు.ఉప్పెన, కొండపొలం వంటి సినిమాలతో ఇప్పటికే ప్రేక్షకులను అలరించాడు.ఇక మూడవ సినిమాగా త్వరలో రంగ రంగ వైభవంగా అంటూ ఒక ట్రెడిషనల్ టచ్ ఉన్న సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
ఇక హీరో సుధీర్ బాబు కూడా ఏమీ తక్కువ తినలేదు ఎప్పుడు సెన్సిబుల్ స్టోరీస్ తో సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఇక సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటూ ఒక విభిన్నమైన ప్రేమ కథతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు.

ఇక ప్రయోగాలకి కేర్ అఫ్ అడ్రస్ గా మారాడు నాగశౌర్య.ఫ్లాపులు ఎక్కువగా చవిచూస్తున్నప్పటికీ తన ప్రయోగాల పనిలో మునిగితేలుతున్నాడు.కృష్ణ వ్రింద విహారి అంటూ సరికొత్త టైటిల్ తో ప్రస్తుతం నాగశౌర్య అభిమానుల ముందుకు రాబోతున్నాడు.
ఇక బెల్లంకొండ తమ్ముడు అయిన బెల్లంకొండ గణేష్ అతి త్వరలోే స్వాతి ముత్యం అనే ఒక డిసెంట్ టైటిల్ తో తన డెబ్యూ సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఇక గుర్తుందా శీతాకాలం అంటూ హీరో సత్యదేవ్ సైతం ఒక విభిన్నమైన టైటిల్ తో అతి త్వరలో థియేటర్లలో సందడి చేయనున్నారు.
ఇలా ఈ యువ హీరోలు అంతా కూడా తమ తమ సినిమా టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా, సున్నితంగా, సాఫ్ట్ గా ఆలోచించడం చూస్తే సరికొత్త పద్ధతికి నాంది పలికినట్టుగా కనిపిస్తుంది.







