కోలీవుడ్ హీరో సూర్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన బేబమ్మ?

ఉప్పెన సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈమె మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ దక్కించుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

 Heroine Krithi Shetty Sensational Comments On Hero Surya , Kollywood, Hero Surya-TeluguStop.com

కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళంలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది.ఈ క్రమంలోనే డైరెక్టర్ బాల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన నటించే అవకాశాన్ని కూడా అందుకుంది.

ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభించి ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

ఈ క్రమంలోనే కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూ సందర్భంగా హీరో సూర్య గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

సినిమాల్లోకి రాకముందు సూర్య సార్ గురించి నేను చాలా విన్నాను.అయితే ఆయనని కలిసి అతనితో పని చేసినప్పుడు ఆయన నిబద్దత ఏంటో తనకు అర్థమైందని, ఆయన ప్రజలతో వ్యవహరించే తీరు,అందరూ బాగుండాలని కోరుకునే విధానం అందరిలోనూ స్ఫూర్తిని నింపుతుందని కృతి శెట్టి సూర్య గురించి ఎంతో గొప్పగా వివరించారు.

Telugu Surya, Bala, Krithishetty, Kollywood, Krithi Shetty-Movie

ఇలా స్టార్ హీరోతో పాటు స్టార్ డైరెక్టర్ బాలా గారి దర్శకత్వంలో సినిమా చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉందని కృతి శెట్టి చెప్పారు. బాల సర్ పనిచేయడం నాకు అర్థమైంది.అతను చాలా పర్ఫెక్షనిస్ట్. షూటింగ్ మొదటి రోజు బాల సర్ నాకు చాలా నమ్మకాన్ని ఇచ్చాడని కృతి శెట్టి ఈ సందర్భంగా డైరెక్టర్ బాల గురించి కూడా వివరించారు.

ఇకపోతే ఈ సినిమా త్వరలోనే తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కానుంది.కృతి శెట్టి రామ్ సరసన నటించిన దివారియర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలతో కృతి శెట్టి ఎంతో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube