2024 ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే కసి, పట్టుదల ఆ పార్టీ అధినేత చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తోంది.పైకి బాగానే ఉంది అనుకున్నా అంతర్గతంగా టిడిపి శ్రేణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జనసేన ,బీజేపీ లతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.బిజెపి మొదటి నుంచి దూరం పెడుతూనే వస్తుండగా జనసేన పొత్తు వ్యవహారం ఎన్నికల సమయం నాటికి కానీ తేలే విధంగా కనిపించడం లేదు.ఒంటరిగా అయినా పోటీ చేసేందుకు ఆ పార్టీ సిద్దమవుతుండడంతో టీడీపీ ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే సిద్ధంగా ఉండాలని ఆలోచనతో బాబు ఉన్నారు. 2024 ఎన్నికలు అషా మాషిగా ఉండవనే విషయం బాబుకు తెలియంది కాదు.ప్రజా వ్యతిరేకత వైసిపి ప్రభుత్వం పై పైకి కనిపిస్తున్నా, జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారంతా వైసీపీ వైపే మద్దతుగా నిలబడే అవకాశం ఉందని సర్వే రిపోర్టులు అందుతూ ఉండడంతో, బాబు ముందుగానే అలర్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలోని తాను దూరం పెడుతూ వస్తున్న నందమూరి కుటుంబానికి దగ్గరయ్యేందుకు , ఎన్నికల సమయంలో రాజకీయంగా వారిని ఉపయోగించుకుని ఎన్నికల ప్రచారం చేయించుకుని గెట్టెక్కాలనే వ్యూహంలో ఉన్నారట.
చంద్రబాబు టిడిపి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తో విభేదాలు ఉన్నాయి.

ఈ క్రమంలో ఆ విభేదాలను పక్కనపెట్టి చంద్రబాబు ఆయనతో సన్నిహితంగా మెలుగుతున్నారు.ఇటీవల ఓ వివాహ వేడుకకు వెంకటేశ్వరావు, చంద్రబాబు ముచ్చటించుకోవడం కనిపించింది.ఇటీవల అనారోగ్యానికి గురైన దగ్గుపాటిని పరామర్శించేందుకు చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లారు.
ఆ విధంగానూ ఆయన కు దగ్గరయ్యారు.ఇక నందమూరి వారసుల విషయానికొస్తే చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ టిడిపిలోనే ఎమ్మెల్యేగా ఉన్నారు.
అయితే నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, మళ్లీ టీడీపీ తరుపున యాక్టీవ్ చేస్తే ఫలితం ఉంటుందని, ఏపీ లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బాబు ఈ ఆలోచనలో ఉన్నారట.

గతంలో టిడిపి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అయితే ఆ తరువాత పూర్తిగా ఆయన్ను పక్కన పెట్టేసారు.రాబోయే ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి చంద్రబాబు ఆయనను పార్టీలో యక్టీవ్ అయ్యి ఎన్నికల ప్రచారానికి రావలసిందిగా కోరే ఆలోచనలోఉన్నట్లుగా టిడిపిలోని కీలక నాయకులు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
మొదటి నుంచి తాను వ్యతిరేకిస్తూ పక్కన పెట్టిన దగ్గుపాటి వెంకటేశ్వరరావును దగ్గర చేసుకున్నట్లే జూనియర్ ఎన్టీఆర్ ను టిడిపి లో యక్టివ్ చేసేలా బాబు స్కెచ్ వేస్తూ ఉండడంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది.







