బుల్లితెర నటి, వెండితెర ఆర్టిస్ట్ హరితేజ గురించి తెలుగు ప్రేక్షకులకులందరికీ బాగా పరిచయం ఉన్న నటి.యాంకర్, డాన్సర్, యాక్టర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది హరితేజ.
తొలిసారిగా 2007లో ఆడవారి మాటలకు అర్ధాలే వేరు సినిమాతో వెండితెరకు పరిచయం కాగా.ఆ తర్వాత ఎన్నో అవకాశాలు అందుకుంది.
తన నటనకు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
కేవలం వెండి తెరపైనే కాకుండా ఇక 2011లో బుల్లితెరలో మనసు మమత సీరియల్ తో ఎంట్రీ ఇవ్వగా.
ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.అంతేకాకుండా బుల్లితెర లో పలు షోలలో కూడా యాంకరింగ్ చేసింది.ఆ తర్వాత 2017 లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.చివరికి వరకు హౌస్ లో ఉంటూ మూడవ స్థానంలో నిలిచింది.
బిగ్ బాస్ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది హరితేజ.

ఇక ఆమె 2015 లో దీపక్ ను వివాహమాడగా.తమకు ఒక కూతురు కూడా ఉంది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే హరితేజ.
తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు తను జిమ్ లో చేసిన వర్కౌట్ వీడియోలను కూడా పంచుకుంటుంది.
ఇక తన భర్త తో చేసే రీల్స్ కూడా షేర్ చేసుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటుంది.

పైగా తనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.ఈ మధ్య గ్లామర్ లుక్ తో కూడా దర్శనమిస్తుంది.
పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ నెగిటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొంటుంది.ఇప్పటికే తను ఒక బిడ్డకు తల్లి.
ఇక తన కుటుంబం కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపిస్తూ ఉంటుంది.కానీ ఆమె మాత్రం గ్లామర్ ను బయట పెట్టింది.

ఇక అప్పుడప్పుడు బుల్లితెరపై జరిగే ఈవెంట్లలో కూడా పాల్గొని తన పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఫాలోవర్స్ తో మరోసారి ముచ్చట్లు పెట్టింది.అందులో ఈ సారి మరో కంటెంట్ తో వచ్చింది.ఇక అందులో చిన్న కిడ్స్ ఉన్న తల్లులను ఒక ప్రశ్న అడిగింది.దాంతో ఒక నెటిజన్ అందుకే సహనం అంటూ కామెంట్ చేయగా.వెంటనే హరితేజ ఒప్పుకుంటాను అని కానీ అది హ్యాండిల్ చేయడం అంతా ఈజీ కాదు అని రిప్లై ఇచ్చింది.
ఎందుకంటే తాను కూడా ఒక బిడ్డ కు తల్లి కాబట్టి ఆ విషయాలను అడిగి తెలుసుకుంటుంది.ప్రస్తుతం ఆ కామెంట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇక హరితేజ ప్రస్తుతం ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ ఉంది.ఇక కొన్ని ప్రాజెక్ట్ లలో అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తుంది.







