రామారావు కాస్త అటుఇటు అయితే రవితేజకు భారీ డ్యామేజ్‌

రవితేజ హీరోగా శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి సోషల్‌ మీడియా లో రకరకాలుగా చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే.

 Ramarao On Duty Film Business Interesting News , News In Telugu , Ramarao On-TeluguStop.com

భారీ ఎత్తున ఈ సినిమా కు ఖర్చు చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.నిర్మాత ఈ సినిమా ను భారీ మొత్తంలో ఖర్చు చేసి నిర్మించాడు.

సినిమా యొక్క బడ్జెట్‌ పరిధి దాటడంతో బిజినెస్ విషయంకు వచ్చేప్పటికి నిరాశ తప్పడం లేదు.అందుకే సినిమా ను మొదట విడుదల చేయాలనుకున్న తేదీకి విడుదల చేయలేదు.

ఆలస్యంగా విడుదల చేసినా కూడా బిజినెస్ ఇంకా పూర్తి స్థాయి లో కాలేదు.సినిమా కు నిర్మాతగా రవితేజ వ్యవహరిస్తున్నాడు.

కనుక రవితేజ ఈ సినిమా ను పలు ఏరియాల్లో సొంతం గా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.ఒక వేళ సినిమా ను కనుక సొంతంగా విడుదల చేస్తే ఖచ్చితంగా రిస్క్‌ కాస్త ఎక్కువ అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా పై బజ్ ను భారీ గా క్రియేట్‌ చేసే విషయం లో యూనిట్‌ సభ్యులు విఫలం అయ్యారు.ఇప్పుడు అది కాస్త సినిమా కు బర్డెన్ గా మారింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా విడుదల అయిన తర్వాత ఫలితం కాస్త అటు ఇటు అయితే రవితేజ భారీ గా నష్టపోవాల్సి రావచ్చు అంటున్నారు.ఈ సినిమా కు రవితేజ తన పారితోషికం ను పెట్టుబడి గా పెట్టాడు.

తద్వారా రిస్క్ రవి తేజ ఎక్కువ తీసుకోబోతున్నాడు.దర్శకుడు శరత్‌ మండవ కూడా ఈ సినిమా కు పారితోషికం విషయం లో చాలా తక్కువ తీసుకున్నాడని.

సినిమా పై అంచనాలు తక్కువ ఉండటం వల్ల ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి.లాంగ్ రన్ లో సినిమా ఫలితం ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube