సాధారణంగా మనం ఏ విషయంలోనైనా తమాషా చేసిన ప్రెగ్నెన్సీ విషయంలో ఎవరు తమాషాలు చేయరు.అది కూడా పెళ్లి కాకుండా ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడితే వారి గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి.
అయితే ప్రస్తుతం ఇలాంటి ప్రెగ్నెన్సీ వార్తలతో నటి రెజినా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.తాజాగా ఈమె ప్రెగ్నెన్సీ గురించి చెప్పిన ఈ వార్త ప్రస్తుతం నెటింట్లో చక్కర్లు కొడుతుంది.
అసలు రెజినా ప్రెగ్నెంట్ ఏంటి అనే విషయానికి వస్తే.
తెలుగు భాషలో ఎన్నో సినిమాలలో నటించిన రెజినా తాజాగా సినిమాలకు దూరమైనప్పటికీ ఎన్నో వెబ్ సిరీస్ తద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే ఆచార్య సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా అందరిని సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా తాను చేసిన కొన్ని అల్లరి పనుల గురించి బయట పెట్టారు.
ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో తనకు మిస్టీ దోయ్ స్వీట్ తినాలనిపించిందట.

ఈ విధంగా తనకు స్వీట్ తినాలనిపించడంతో ఆ సమయంలో బయటకు వెళ్ళగా స్వీట్ షాప్స్ అన్ని మూసేశారు.అయితే ఒక షాప్ మూసేస్తున్న సమయంలో అతని దగ్గరికి వెళ్లి తనకు స్వీట్ కావాలని అడిగారట.ఇక షాప్ క్లోజ్ చేస్తున్నాను ఇవ్వడం కుదరదని యజమాని చెప్పగా ఎలాగైనా స్వీట్ తినాలని ఉద్దేశంతో తాను ప్రెగ్నెంట్ అని తనకు ఆ స్వీట్ చాలా తినాలనిపిస్తుందని అబద్ధం చెప్పారట.
సాధారణంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఏదైనా తినాలనిపిస్తే ఎంత కష్టమైనా వాటిని తీసుకువచ్చిస్తారు.ఇక రెజీనా కూడా దానినే అవకాశంగా చేసుకొని తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్పడంతో ఆ స్వీట్ యాజమాన్యం తనకు ఆ సమయంలో స్వీట్స్ ఇచ్చినట్టు ఈ సందర్భంగా రెజీనా తన అల్లరి పనుల గురించి బయటపెట్టారు.
ఈ సందర్భంగా రెజీనా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.







