ఈరోజుల్లో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ అనేది సవాలుతో కూడుకొన్న విషయం.తరతరాలుగా ఇలాంటి పనులు ఓ వర్గం వారు మాత్రమే చేస్తున్నారు.
తత్ఫలితంగా 1993 నుంచి దాదాపు 900 మంది సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారని సమాచారం.ఇలాంటివారి ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని IIT మద్రాస్‌కు చెందిన Solinar అనే స్టార్టప్ కంపెనీ ఈ రోబోటిక్ మెషిన్‌ను అభివృద్ధి చేసింది.
IIT మద్రాస్‌కు చెందిన విద్యార్థులు, ఒక అధ్యాపకుడు కలిసి ఈ సంస్థను స్థాపించడం జరిగింది.
అయితే ఇక్కడ ఫొటోలో వున్న మహిళ పేరు నాగమల్.ఆమె వయస్సు 45 సంవత్సరాలు.20 ఏళ్ల క్రితం సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న సమయంలో ఆమె భర్త విష వాయువులు పీల్చి మరణించాడు.దీంతో నాగమల్ ఒంటరిగా ఓ 4 ఇళ్లలో పని చేసి వచ్చిన ఆదాయంతో తన ఇద్దరు కూతుళ్లను కష్టపడి పెంచి పెద్ద చేసింది.అయితే ఇప్పుడు ఆమెకి మంచి రోజులు వచ్చాయి.
ఆమె త్వరలో ఆమె ఓ వ్యాపారవేత్తగా మారబోతోంది.సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే రోబోను ఆమె స్వంతం చేసుకోబోతోంది.
దీనికోసం ప్రస్తుతం ఆమె రోబోటిక్ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ మెషిన్‌ను ఆపరేట్ చేయడంలో శిక్షణ పొందుతోంది.IIT మద్రాస్ లో ఈ వర్క్ షాప్ జరుగుతోంది.

ఇకపోతే వీరు తయారు చేసిన రోబోటిక్ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ మెషిన్ ఖరీదు దాదాపు రూ.20 లక్షల వరకు ఉంటుంది.అయితే CSR (Corporate Social Responsibility) ఫండింగ్‌తో నాగమల్ లాంటి వారు ఈ మెషిన్‌ను ఉచితంగా పొందగలుగుతున్నారు.ఈ మెషిన్‌ను ట్రాక్టర్ మీద పెట్టి సెప్టిక్ ట్యాంక్ దగ్గరకు తీసుకెళ్లవచ్చు.
మరో ఇద్దరి సహాయంతో ఈ మెషిన్‌ను ఆపరేట్ చేసి సెప్టెక్ ట్యాంక్‌ను క్లీన్ చేయవచ్చు.నాగమల్ లాంటి బాధితులకు ఈ మెషిన్లను అందిస్తున్నారు.అలాంటివారిలో ఈమె మొదటివారు కావడం విశేషం.







