అక్కడ ఓ లేడీ రిపోర్టర్ లైవ్‌లో రిపోర్ట్ చేస్తూ ఉన్నారు.చుట్టూ జనాలు గుమిగూడి ఆమెనే చూస్తున్నారు.
ఆమెకి సమీపంగా ఓ అబ్బాయి వున్నాడు.అతడు సైలెంట్ గానే వున్నాడు.
అయితే ఇంతలో ఆ రిపోర్టర్ కి ఏమనిపించిందో గాని, హఠాత్తుగా ఆమె అతడి చెంప వాయించింది.దీంతో అక్కడ ఉన్నవారందరూ షాకయ్యారు.
వారికి ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్ధం కాలేదు.ఆమె కూడా దీని గురించి అక్కడ చెప్పలేదు.
ఆ అబ్బాయి కూడా ఎదురు తిరిగినట్టు అనిపించలేదు.తర్వాత తన రిపోర్టింగ్ తాను చేసుకుని అక్కడినుండి వెళ్లిపోయింది.
కట్ చేస్తే, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.అయితే ఆమె ఇండియా రిపోర్టర్ కాదు.పాకిస్తాన్ కు చెందిన ఓ లోకల్ మీడియా రిపోర్టర్.ఆమె పేరు మైరా హష్మి.
న్యూస్ యాంకరింగ్‌కు గ్లామర్ అద్దడంలో ఆమె ప్రత్యేకత అని అందరు చెప్పుకుంటూ వుంటారు.అందుకే ఆమె గురించి ప్లస్ అయినా.
మైనస్ అయినా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ ఉంటుంది.పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఆమె విధులు నిర్వహిస్తోందని సమాచారం.
ఒక్క పాకిస్థాన్‌లోనే కాదు.ఇండియాలో కూడా ఆమె మంచి పాపులర్.
ఎలాగంటే మన ఈ సోషల్ మీడియాలద్వారానే.
అయితే, ఆమె తీరుపై పాకిస్తాన్ సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది.
అనవసరంగా ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పించారు.దానికి ఆమె ఓ అదిరిపోయే వివరణ ఇచ్చింది.
తాను ఏ తప్పు చేయలేదని ఉర్దూలో వివరణ ఇచ్చింది.తాను రిపోర్ట్ చేస్తున్న కుటుంబాన్ని ఆ వ్యక్తి అదే పనిగా హరాస్ చేస్తున్నాడని, తాను ఎంత చెప్పినా వినడంలేదని… అందుకే అలా కొట్టవలసి వచ్చిందని ఆమె తాజాగా వివరించింది.
అక్కడితో ఆగకుండా “అలాంటి వ్యక్తిని వదిలేద్దామా చెప్పండి?” అని ప్రశ్నించింది కూడా.దాంతో విషయం అర్ధం అయిన నెటిజన్లు ఆమెని కీర్తిస్తున్నారు.







