విద్యుత్ చావులన్నీ పాలకుల నిర్లక్ష్యపు హత్యలు కావా?తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విప్లవ నేతాజీ బోరన్న లేఖ.వాలిన విద్యుత్ స్తంభాలు నేలను తాకుతున్న తీగలు,కావవి విద్యుత్తు తీగలు,అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలను, పశువులను దారుణంగా హత్య చేస్తున్న యమ పాశాలంటూ పాలకుల నిర్లక్ష్యంపై ప్రజానేస్తం కామ్రేడ్ బోసన్న మండిపడ్డారు.
పల్లెలు,పట్టణాల్లో వెలుగులు విరజిమ్మాల్సిన విద్యుత్ తీగలు,దురదృష్టవశాత్తు మృత్యు తీగలుగా మారి ప్రతియేటా తెలుగు రాష్ట్రాల్లో పదివేల మందికిపైగా ప్రజలను,వేలాది పశువులను బలిగొంటున్నాయని ప్రముఖ సామాజిక కార్యకర్త,ప్రజాభ్యుదయవాది కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బోరా సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతిరోజు జిల్లాకో చోట కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి పశువులు,పక్షులు,మనుషులు ప్రాణాలు కోల్పోతున్నా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కనీసం చలనం లేదని కార్మిక కర్షక ప్రజా పోరాటాల యోధుడు బోర సుభాషన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యుత్ తీగలను సవరించాలని,ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచె ఏర్పాటు చేయాలని కనీస ఆలోచన కూడా అధికారులకు లేకపోవడంతోనే ఏటా ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగిపోతుందని బహుజన ప్రజా శ్రేయోభిలాషి బోర సుభాషన్న ఆరోపించారు.విద్యుత్ సరఫరా నిర్వహణ తీరు అద్వానంగా తయారయిందని, విద్యుత్ శాఖ అధికారులు రాబోయే ప్రమాదాలను ఏమాత్రం గుర్తించక పోవడంతోటే విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తున్నాయని,స్పందించాల్సిన అధికారులు, పాలకులు చేష్టలుడిగి చూస్తున్నారని ప్రజా హితుడు బోరన్న మండిపడ్డారు.
కుటుంబ పెద్దలు ప్రమాదంలో చనిపోవడంతో బాధిత కుటుంబాలు వీధిన పడుతున్నాయని,పిల్లలు అనాథలు అవుతున్నారని బోర సుభాష్ చంద్ర బోస్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన బహిరంగ లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.శ్రీకాకుళం నుండి సిరిసిల్ల దాకా,అదిలాబాద్ నుండి అనంతపురం దాకా తెలుగు రాష్ట్రాల్లో వేలాది చోట్ల వాలిన విద్యుత్ స్తంభాలు నేలను తాకుతున్న తీగలు ప్రమాదాలకు నెలవుగా ఉన్నాయని ప్రజా ఉద్యమకారుడు సుభాషన్న పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని నల్లరేగడి, ఒండ్రుమట్టి,ఇసుక నేలలో పాతిన విద్యుత్ స్తంబాలు ఒరిగిపోతుంది ఉంటున్నాయని విప్లవ నేత బోరన్న తెలిపారు.వేలాడే తీగలను బిగుతుగా లాగుదామని ఏ అధికారి కూడా ఆలోచించడం లేదని ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రెండు రోజుల హడావిడి తప్పా ఏమాత్రం పట్టించుకోవడం లేదని బోసన్న పేర్కొన్నారు.
విద్యుత్ తీగలు స్తంభాలు ప్రమాదకరంగా మారడంవల్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారని ప్రజా నేస్తం బోరన్న తెలిపారు.ప్రమాదాలు జరిగితే గాని పట్టించుకోరా అని ముఖ్యమంత్రులను బోర సుభాషన్న ప్రశ్నించారు.
నెలనెలా విద్యుత్ బిల్లులను వసూలు చేయడంపై అధికారులు చూపుతున్న శ్రద్ధ నేలను తాకేలా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను సరి చేయడంలో ఎందుకు లేదని పేద ప్రజల శ్రేయోభిలాషి బోరన్న పాలకవర్గాలను నిలదీశారు.నేలకు గజం ఎత్తు దూరంలో వేలాడిన విద్యుత్ తీగల వల్ల తన సొంత మేనమామ మున్నా శ్రీరాములయ్య యాదవ్ 9182969119 మనువడు మున్నా రామ్ మల్లు పెద్ద కొడుకు మున్నా శ్రీకాంత్ యాదవ్ గతంలో ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని నేటికీ మరిచిపోలేక పోతున్నామని కామ్రేడ్ సుభాషన్న కన్నీరు పెట్టారు.
విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం కాదు,వాటిని నిరంతరం పర్యవేక్షించాలని బోరన్న కోరారు.చాలా చోట్ల నెత్తిమీద హైటెన్షన్ విద్యుత్ లైన్ పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని,వారి కష్టాలను తొలగించాలని,వాటి స్థానంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ పనులను చేపట్టాలని బోసన్న పేర్కొన్నారు.
హై టెన్షన్ విద్యుత్ లైన్లు వీధుల మధ్యలో,జన సంచార ప్రాంతాల్లో,ఇండ్ల పైన ఉండనీయరాదని బోర సుభాషన్న కోరారు.భూగర్భ విద్యుత్ సరఫరా వ్యవస్థ పనులను చేపట్టడం ద్వారా ప్రజల కష్టాలు తొలగడంతో పాటు భారీ వర్షాలు వచ్చినప్పుడు సైతం విద్యుత్ సరఫరా నిరాటకంగా కొనసాగించవచ్చని బోరన్న హితవు పలికారు.
చాలా చోట్ల వ్యవసాయ బావుల వద్ద నేలకు తాకేలా విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయని,దీనివల్ల పశువులు,పక్షులు, మనుషులు చనిపోతున్నారని రైతు నాయకుడు వేల్పుల శ్రీశైలం మల్లన్న యాదవ్,గౌతమి 9848641522 తెలిపిన విషయాన్ని బోరన్న పాలకులకు గుర్తు చేశారు.







