కష్టపడకుండానే కోట్లాది రూపాయలు సంపాదించాలనుకుంటున్నారా… మీ అదృష్టాన్ని పరీక్షించుకుని కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నారా? అయితే కేరళ రాష్ట్రం మీకు ఒక సువర్ణ అవకాశం కల్పిస్తోంది.ఓనం సందర్భంగా రాష్ట్ర చరిత్రలోనే భారీ లాటరీ నిర్వహించేందుకు కేరళ సిద్ధమైంది.ఈ లాటరీలో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకోవచ్చు.మొట్టమొదటిగా ఒకే లాటరీ టిక్కెట్‌పై రూ.25 కోట్లు ఆఫర్ చేయడం ఇదే తొలిసారి.ఇక సెకండ్ విన్నర్ రూ.5 కోట్లు, ఆ తరువాత స్థానంలో నిలిచిన 10 మంది రూ.1 కోటి విలువైన బహుమతులు సొంతం చేసుకోవచ్చు.
ఓనం విభాగం నిర్వహించే ఈ భారీ లాటరీకు సోమవారం రాష్ట్ర లాటరీల శాఖ (తిరువోణం) ఆమోద ముద్ర వేసింది.ఈ లాటరీ ఏకంగా రూ.126 కోట్లు మొత్తాన్ని అదృష్టవంతులకు అందిస్తుంది.అయితే ఈ ఏడాది టికెట్ ధర రూ.500గా నిర్ణయించారు.గతేడాది టికెట్ ధర రూ.300గా ఉండేది.అయితే ప్రైజ్ మనీ పెంచడంతో ఇప్పుడు టికెట్ల ధరలను కూడా లాటరీ విభాగం పెంచేసింది.టికెట్‌లను జులై 18 నుంచి అమ్ముతారు.సెప్టెంబర్ 18న లక్కీ డ్రా నిర్వహిస్తారు.అయితే ఫస్ట్ విన్నర్‌కి రూ.25 కోట్లు అని చెబుతున్నారు కానీ ఏజెంట్ కమీషన్, ట్యాక్స్ పోనూ చేతికి రూ.15.75 కోట్లు అందుతాయి.ఇది కూడా చాలా పెద్ద అమౌంట్ అని చెప్పవచ్చు.
ఈసారి ఓనం విభాగం ఆఫర్ చేసిన ప్రైజ్ మనీ 2021 కంటే రూ.72 కోట్లు ఎక్కువగా ఉండటం విశేషం.ఈ ఏడాది 10 తృతీయ బహుమతులు ఉండగా.2021లో 6 గిఫ్ట్స్ మాత్రమే ఇచ్చారు.ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న టికెట్‌ను అమ్మిన ఏజెంట్‌కు కమీషన్ రూపంలో రూ.2.50 కోట్లు వరిస్తాయి. ఈసారి లాటరీ డిపార్ట్‌మెంట్ 90 లక్షల టికెట్‌లను ముద్రించనుంది.అంటే రూ.450 కోట్ల విలువైన టికెట్లను అమ్ముతారు.2021లో మొత్తంగా 54 లక్షల టికెట్‌లు అమ్ముడయ్యాయి.అంటే లాటరీ విభాగానికి రూ.162 కోట్లు వచ్చాయి.ఇలా చూసుకుంటే అటువైపు లాటరీ యాజమాన్యానికి లేదా ప్రభుత్వానికి, ఇటువైపు అదృష్టవంతులకు కాసుల వర్షం కురుస్తుందని చెప్పవచ్చు.
అయితే ఈసారి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొత్తగా తొమ్మిది మందికి కన్సోలేషన్ ప్రైజ్ కింద ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఆఫర్ చేయనున్నారు.అంతేకాదు, 90 మందికి ఒక్కొక్కరికి రూ.1లక్ష అందజేస్తారు.అలానే ఏకంగా 72 వేల టిక్కెట్లకు రూ.5 వేలు ఇస్తారు.అంటే ఈ సారి చాలా మందిని అదృష్టం వరించనుందని చెప్పవచ్చు.ఆసక్తి ఉన్నవారు కేరళ లాటరీ ఏజెంట్ల నుంచి టికెట్లు కొనుగోలు చేయవచ్చు.







