సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీ హోదా అన్నది ఎంతో కష్టపడితే గాని దక్కదు.అయితే కొంతమంది స్టార్ లు ఎన్ని సినిమాలు చేసినా కూడా సరైన గుర్తింపు దక్కదు.
కానీ కొందరికి మాత్రం అదృష్టవశాత్తు ఓవర్ నైట్ లోనే స్టార్ లుగా మారిపోతూ ఉంటారు.ఓవర్ నైట్ లోనే స్టార్ డమ్ ను సంపాదించుకున్న సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు.
అయితే సెలబ్రిటీ హోదా దక్కినప్పటికీ అది అలాగే కంటిన్యూ చేస్తూ కొనసాగడం అన్నది కూడా చాలా కష్టం.కాగా ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన నెగటివ్ ప్రచారాలు ఎక్కువ అయ్యాయి.
అయితే ఒక్కొక్కసారి ఈ సెలబ్రిటీలకు కూడా ఒక విధంగా చాలా ఉపయోగపడుతున్నాయట.
అవి నిజమైన అబద్ధమైన కూడా గాసిపు రూమర్స్ ఇవన్నీ కూడా సెలబ్రిటీలకు ఒక ఆయుధం అని వార్తలు వినిపిస్తున్నాయి.
కాకా ఇటీవల కాలంలో అయితే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిలకు సంబంధించిన గాసిప్స్ ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ ఆ వార్తలపై సెలబ్రిటీలు ఏ మాత్రం స్పందించడం లేదు.సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఆ గాసిప్స్ ని వారికి వారికి అనుగుణంగా ఆదాయంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల నెట్ ఫిక్స్ లో రణ్ వీర్ సింగ్ విత్ బేర్ గ్రిల్స్ ఎపిసోడ్ మంచి క్రేజ్ ను అందుకుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆషికానా జి ఫైవ్ లో సాస్ బహు ఆచార్ సహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చాలా ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లకు పరవాలేదు అనిపించే విధంగా బజ్ ని క్రియేట్ చేసుకున్నాయి.

ట్రాకింగ్ వెబ్సైట్ ల ప్రకారం అయితే రణ్ వీర్ షో 6.6 మిలియన్ వ్యూస్ తో అగ్రస్థానంలో ఉండగా ఆషికానా 4.5 ప్లస్ మిలియన్ల వ్యూస్తో రెండో స్థానంలో ఉంది.ఆ తరువాత 3.7 ప్లస్ మిలియన్ ల వ్యూస్ తో ఆ తర్వాత స్థానంలో నిలిచింది.ఇది బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ పోస్టుగా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ సీజన్ 7 షో కి అంతకంటే ఎక్కువ స్థాయిలోనే క్రేజ్ అందుకుంది.
ఈ షో ప్రారంభం ఎపిసోడ్ లోనే రణవీర్ సింగ్ అలియా భట్ పాల్గొన్నారు.ఇది 12.2+ మిలియన్ల వ్యూస్ ని సంపాదించుకుంది.ఈ ఇద్దరు సెలబ్రిటీలు వారి వైవాహిక జీవితం శృంగారం ఇతరుల గాసిప్ల గురించి మాట్లాడుకుంటే జనాలు ఎంతగా ఇష్టపడతారో అర్థమవుతోంది.
ఒక విధంగా గాసిప్స్ ద్వారా సెలబ్రెటీలకు ఆదాయ పరంగా అయితే షోలతో మంచి ప్రాఫిట్స్ దక్కుతోంది అని చెప్పవచ్చు.








