బాలీవుడ్ ముద్దుగుమ్మ హీరోయిన్ వాణి కపూర్ గురించి మనందరికీ తెలిసిందే.టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని నటించిన ఆహా కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.
అలాగే బాలీవుడ్ లో కూడా కలిసి సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.ఇది ఒక వైపు కమర్షియల్ సినిమాలతో పాటుగా మరొకవైపు నటనకు ఎక్కువగా ప్రాధాన్యం ఉన్న రోల్స్ లో నటిస్తూ నేర్పించే ప్రయత్నం చేస్తుంది.
కాగా ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్లతో కుర్ర కారుని రెచ్చగొడుతూ తనకున్న ఫాన్స్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా వాణి కపూర్ నటించిన చిత్రం సంషేరా. రన్బీర్ కపూర్ ద్విపాత్రభినయం చేస్తున్న ఈ సినిమాలో సోనా అనే పాటలు నటించింది వాణి కపూర్.
అయితే ఈ సినిమాలో ఆ స్పెషల్ పాత్ర కోసం ఆమె గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నట్లు తెలిపింది.ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.గుర్రపు స్వారీ నేర్చుకున్న సమయంలో తన అనుభవాలను పంచుకుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ఇది నాకెంతో ఛాలెంజింగ్ పాత్ర.ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నాను.నా దృష్టిలో గుర్రాలు అత్యంత అందమైన జంతువులు.వాటికి ప్రేమ భాష మాత్రమే తెలుసు.గుర్రపు స్వారీ నేర్చుకోవడానికి ముందు వాటితో సన్నిహితంగా ఉండటం,స్నేహం చేయడం,ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకోవడం అన్నది ముఖ్యంగా అవసరం అని చెప్పుకొచ్చింది వాణి కపూర్.
కాగా వాటితో అలా బాండింగ్ ఏర్పరచుకోకపోతే అవి మనల్ని విసిరేస్తాయి.అందుకోసం నేను శిక్షణ సమయంలో వాటికోసం ఆహారాన్ని తీసుకువచ్చేదాన్ని అలా వాటిని మచ్చిక చేసుకొని గుర్రపు స్వారీ నేర్చుకున్న అని చెప్పుకొచ్చింది వాణి కపూర్.
ఇకపోతే ఈ ముద్దుగుమ్మ నటించిన సంషేరా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.







