సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని పోలీసు కేంద్ర కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ పోలీసు అధికారుల నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు.నేరాల తీరుతెన్నులు,కేసుల నమోదు, దర్యాప్తు ప్రక్రియ,కోర్టు విధులు,పెండింగ్ కేసులు, కేసు దస్త్రాలు పరిశీలించారు.
పెండింగ్ కేసులను ముగించేలా నాణ్యమైన దర్యాప్తు చేయాలన్నారు.సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని,నేరాల అదుపునకు తీసుకోవాల్సిన చర్యలు,ప్రణాళికను ఎస్పీ వివరించారు.
రోడ్డు భద్రత చర్యలు పాటించాలన్నారు.పెట్రోలింగ్,బీట్స్ సమర్థవంతంగా నిర్వర్తించాలి,పోలీస్ ఫంక్షన్ వర్టికల్ పని విభాగాలను సక్రమంగా అమలు చేయాలని అన్నారు.
ప్రజలకు పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అధికారులకు ఆదేశాలిచ్చారు.ఎక్కువ మొత్తంలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయించి నేరాల నివారణలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సిబ్బందికి సూచనలు చేశారు.
వర్షాల దృష్ట్యా ప్రజలకు అందుబాటులో ఉండాలని పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు.ఈ సమావేశం నందు డిఎస్పీలు నాగభూషణం,వెంకటేశ్వరరెడ్డి,సిఐలు విఠల్ రెడ్డి, శ్రీనివాస్,నర్సింహ,రాజేష్,నర్సింహారావు, ఆంజనేయులు,ఆంజనేయులు,రామలింగారెడ్డి, నాగర్జున,పి.
ఎన్.డి.ప్రసాద్,ఎస్ఐలు,సిబ్బంది పాల్గొన్నారు.