వయసు పైబడే కొద్ది కంటి చూపు తగ్గడం అనేది సర్వ సాధారణమైన విషయం.కానీ, ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కంటి చూపు సరిగ్గా కనిపించక సతమతం అవుతున్నాయి.
ఈ క్రమంలోనే స్పెట్స్, కాంటాక్ట్ లెన్స్ వంటివి వాడుతుంటారు.కొందరు ఆపరేషన్ కూడా చేయించుకుంటారు.
కానీ, కంటి ఆరోగ్యానికి అవసరం అయ్యే పోషకాలను అందిస్తే.ఆపరేషన్ వరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు.
కంటి చూపును మెరుగుపరుచుకోవడం కోసం విటమిన్ `ఎ` ను తీసుకుంటే సరిపోతుందని భావిస్తారు.
అయితే కంటి ఆరోగ్యానికి విటమిన్ ఎ ఒక్కటే సరిపోదు.
విటమిన్ బి12 కూడా ఎంతో అవసరం.బాడీలో ఈ రెండు విటమిన్లు తగ్గితే.
కంటి చూపు కూడా తగ్గుతుంది.అందుకే విటమిన్ ఎ, విటమిన్ బి12 లోపాలు ఏర్పడకుండా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరి అందు కోసం ఏయే ఆహారాలు తీసుకోవాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.క్యారెట్లు, చిలగడ దుంపలు, గుమ్మడి కాయ, బచ్చలి కూర, బ్రోకలీ, టమోటాలు, రెడ్ క్యాప్సికమ్, సీతాఫలం, బొప్పాయి, మామిడి, ఫిష్ ఆయిల్, చేపలు, గుడ్లు, పాలు, అవకాడో వంటి ఆహారాల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.
వీటిని డైట్‌లో చేర్చుకుంటే శరీరానికి అవసరం అయ్యే విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది.దాంతో కంటి చూపు పెరుగుతుంది.
అలాగే విటమిన్ బి12 విషయానికి వస్తే.ఇది మీట్, రొయ్యలు, జున్ను, గుడ్లు, తృణధాన్యాలు, కొబ్బరి పాలు, వాల్‌నట్స్, వేరుశెనగలు, పెరుగు వంటి ఫుడ్స్‌లో అధికంగా ఉంటుంది.వీటిని డైట్ లో చేర్చుకుంటే శరీరంలో విటమిన్ బి12 కొరత ఏర్పడకుండా ఉంటుంది.ఫలితంగా కంటి చూపు మెరుగ్గా మారుతుంది.కాబట్టి, ఎవరైతే తమ చూపు తగ్గుతుందని భావిస్తున్నారో.వారు తప్పకుండా ఇప్పుడు చెప్పిన విటమిన్ ఎ, విటమిన్ బి12 రిచ్ ఫుడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకోండి.