దక్షిణ కాలిఫోర్నియాలోని 7 ఎలెవన్ స్టోర్స్ సోమవారం కాల్పుల మోత, వరుస దొంగతనాలతో వణికిపోయింది.ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.
ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు అమెరికన్ మీడియా కథనాలను ప్రసారం చేసింది.ఈ ఘటనలకు సంబంధించి నిందితులను వెతికే పనిలో పడ్డారు పోలీసులు.7 ఎలెవన్ బ్రాండ్ తన 95వ పుట్టినరోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా దాని స్టోర్ లలో ఘనంగా వేడుకలు నిర్వహించింది.దీనిపై 7 ఎలెవన్ సంస్థ స్పందించింది.
తాము ఈ భయంకరమైన విషాదంపై సమాచారాన్ని సేకరిస్తున్నామని, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది.రివర్ సైడ్, శాంటా అనా, బ్రీ, లా హబ్రా నగరాల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఇందుకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు.
ఒక అనుమానితుడు మాత్రమే ఇందుకు సమాధానం చెప్పగల వ్యక్తని తాము భావిస్తున్నట్లు రివర్ సైడ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి ర్యాన్ రైల్స్ బ్యాక్ మీడియాకు తెలిపారు.తెల్లవారుజామున 1.50 గంటలకు ఇక్కడ మొదట కాల్పులు చోటు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.ఆ తర్వాత ఇతర నగరాల్లోనూ కాల్పులు చోటు చేసుకున్నాయని.ఇవన్నీ ఒకే రకంగా వున్నాయని ర్యాన్ రైల్స్ అనుమానం వ్యక్తం చేశారు.ఈ కేసు వింతగా కూడా వుందని.సాధారణంగా నేరస్తులు కన్వీనియన్స్ స్టోర్లలో దోపిడీలకు పాల్పడరని చెప్పారు.

రివర్ సైడ్ ఘటనలో దుండగుడు గుమస్తాను దోచుకుని.ఆపై కస్టమర్లపై దోపిడీలు జరిపి పారిపోయాడని రైల్స్ బ్యాక్ తెలిపారు.అనుమానితుడు కస్టమర్ పై ఎందుకు కాల్పులు జరిపాడో తెలియరాలేదని ఆయన పేర్కొన్నారు.ఆ తర్వాత తెల్లవారుజామున 3.20 గంటలకు అక్కడికి 39 కిలోమీటర్ల దూరంలో వున్న శాంటా అనాలో రెండవ కాల్పులు చోటు చేసుకున్నాయి.అయితే మరికొన్ని అమెరికన్ ఛానెల్స్ లో కాల్పులు జరిగిన సమయాలు ఇలా వున్నాయి.అర్ధరాత్రి 12 , 12.37, 1.50 , 3.23, 4.18, 4.55 గంటలకు పలు ప్రాంతాల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి.ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు.సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.







