నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన దసరా మూవీ ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుంది.నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
దాదాపుగా 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో ఈ సినిమాకు భారీ మొత్తంలో ఆదాయం చేకూరిందని తెలుస్తోంది.
ఈ సినిమాతో నాని జాక్ పాట్ కొట్టాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా ఈ సినిమా నిర్మాతలకు ఏకంగా 47 కోట్ల రూపాయల ఆదాయం చేకూరిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
నాని కెరీర్ లో ఈ స్థాయిలో నాన్ థియేట్రికల్ హక్కులు అమ్ముడైన సినిమ దసరా మాత్రమే కావడం గమనార్హం.వరుస ఫ్లాపుల్లో ఉన్న నాని ఈ సినిమాతో జాక్ పాట్ కొట్టాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా కోసం నాని తన లుక్ ను పూర్తిస్థాయిలో మార్చుకున్నారనే సంగతి తెలిసిందే.తక్కువ బడ్జెట్ లో దసరా సినిమా పూర్తై ఉంటే విడుదలకు ముందే దసరా సినిమా నిర్మాతకు లాభాలు వచ్చి ఉండేవి.
నాని గత సినిమా అంటే సుందరానికి థియేటర్లలో 22 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.నాని రేంజ్ కు ఈ కలెక్షన్లు చాలా తక్కువ మొత్తం అనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఒక భారీ ఫైట్ సీన్ ఉండగా ఆ సీన్ కోసం ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది.ఈ సినిమాలో ఒక సాంగ్ ఉందని ఆ సాంగ్ కోసం ఏకంగా 2 కోట్ల రుపాయలు ఖర్చు చేశారని సమాచారం.నాని ఈ సినిమా కోసం 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.







