భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాళ్లకుంట చెరువులో వలకు చిక్కిన వింత చేప..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, అప్పారావుపేట గ్రామంలోని రాళ్లకుంట చెరువు గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిండడంతో స్థానికులు చేపలు వేటకు చెరువుకి వెళ్లారు.గ్రామస్థుల వలకు అరుదైన వింత చేప చిక్కింది.

 Strange Fish Caught In Bhadradri District Rallakunta Lake Details, Strange Fish-TeluguStop.com

చూడడానికి ఆశ్చర్యంగా ఉన్న చేప దొరకడంతో చేపను పట్టుకున్న వ్యక్తి దానిని ఇంటికి తీసుకుని వచ్చాడు.

చుట్టుప్రక్కల వారికి విషయం తెలియడంతో అరుదైన వింత చేపను చూసేందుకు స్థానికులు అధిక సంఖ్యలో వచ్చారు.

సాధారణ చేపల కంటే భిన్నంగా నోరు క్రిందకు ఉండి, విచిత్రంగా శబ్దాలు చేస్తూ, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా చేప ఆకృతి ఉండడంతో అరుదైన వింత చేపను చూసేందుకు జనం ఎగబడ్డారు.

ఆనోటా ఈనోటా విషయం బయటకు చేరడంతో స్థానికంగా వింత చేప విషయం వైరల్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube