సర్కస్ ట్రైనర్‌పై ఎలుగుబంటి భయంకర దాడి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..

కౄర మృగాలు క్రూరంగానే ప్రవర్తిస్తాయి.వాటిని ఎంత మచ్చిక చేసుకున్నా ఏదో ఒక సమయంలో తమలోని సహజ గుణాన్ని బయటపడతాయి.

 Bear Suddenly Attacks Trainer On Stage Viral Video,bear Attack, Circus Trainer,r-TeluguStop.com

ఇదే జరిగితే వాటి చేతుల్లో ప్రాణాలు కోల్పోవడం ఖాయం.అయితే ఇంటి వద్ద ప్రేమగా పెంచుకునే సింహాలు, పులులు వంటి జంతువులు దాడులు చేయడం చాలా అరుదు.

కానీ బాగా హింసించి, బంధించి వాటి చేత సర్కస్ చేయించే ట్రైనర్లపై మాత్రం ఇవి తరచుగా దాడులు చేస్తుంటాయి.ఇప్పటికే చాలా మంది సర్కస్ ట్రైనర్లు క్రూర మృగాల దాడుల్లో దారుణంగా చనిపోయారు.

అయితే తాజాగా మరొక సర్కస్ ట్రైనర్ కూడా ఒక అడవి మృగం దాడికి గురయ్యాడు.అదృష్టం కొద్దీ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.దీనికి సంబంధించిన వీడియోని యానిమల్స్ పవర్స్ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేసింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతారు.

ఈ క్లిప్ ఇప్పటికే లక్షల వ్యూస్ తో వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న క్లిప్‌లో సుమారు 300 కిలోల ఎలుగుబంటి తన ట్రైనర్‌పై దాడి చేయడం చూడొచ్చు.

ఆ భారీ ఎలుగుబంటి ఒక్కసారిగా ఆ ట్రైనర్‌ని చేతిపై కొరికింది.అతనిని నేలపై పడేసి తల, మెడ కొరికేద్దాం అనుకుంది.

అయితే అప్పటి వరకు సర్కస్ ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఈ దృశ్యాలను చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.కళ్లముందే అంతటి ఘోరం జరుగుతుంటే బాగా భయపడిపోయి అరవడం స్టార్ట్ చేసారు.

కొందరు అక్కడి నుంచి పారిపోయారు.

అయితే పక్కనే ఉన్న మరొక ట్రైనర్ ఈ ఎలుగుబంటిని బలంగా తన్నాడు.ఆ తర్వాత దానికి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాడు.దాంతో అది స్పృహ తప్పి పడిపోయింది.

అలా ట్రైనర్ ప్రాణాలను కాపాడి.ఆ జంతువును లొంగదీసుకున్నాడు.

నివేదికల ప్రకారం, ట్రైనర్ బాగా గాయపడ్డాడు.ఈ ఘటన 2019లో జరగగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడే వెలుగులోకి వచ్చింది.

దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube