మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా ఎంతో ఫిట్ గా ఉంటూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ కుర్ర హీరోలకే సవాల్ విసురుతున్నాడు.సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఫాస్ట్ గా సినిమాలు పూర్తి చేస్తున్నాడు.
అయితే ఈయన నటించిన ఆచార్య సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ఈయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలి పోయింది.దీంతో మెగా ఫ్యాన్స్ సైతం తీవ్ర నిరాశ వ్యక్తం చేసారు.
అయినా కూడా చిరు నిరాశ పడకుండా నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు.
ఎలాగైనా తర్వాత సినిమాలతో హిట్ కొట్టి ఫ్యాన్స్ ను ఖుషీ చేయాలనీ ఆశ పడుతున్నాడు.
ప్రెసెంట్ చిరంజీవి తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.
ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కానుంది.అలాగే చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.

ఇంకా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది.మెగాస్టార్ 154వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ ను అనుకుంటున్నారు ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇక తాజాగా ఈ సినిమాపై మరొక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ జులై 13 నుండి స్టార్ట్ చేయబోతున్నారని టాక్.ఈ షెడ్యూల్ లో మాస్ మహారాజ రవితేజ, చిరంజీవి లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట.అంతేకాదు చిరు ఇంట్రో సాంగ్ కూడా షూట్ చేయబోతున్నారట.ఇక ఈ సినిమాలో రవితేజ భార్య, పిల్లాడితో శ్రీలంక లో జీవించే వ్యక్తిగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించ నున్నారట.మరి వీరిద్దరి కాంబో తెరమీద ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.







