మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అఖిల్?

అక్కినేని వారసుడు అఖిల్.అఖిల్ అనే సినిమా ద్వారా హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు.

 Hero Akkineni Akihil Green Signal To Venu Sriram Know Details Inside , Hero Akhi-TeluguStop.com

అయితే ఈయన నటించిన మొదటి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాయి.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ద్వారా మంచి హిట్ కొట్టిన అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాలో నటిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చిన అఖిల్ ఏజెంట్ సినిమా ద్వారా మరో హిట్టు కొట్టబోతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.కండలు తిరిగిన బాడీతో సూపర్ సాలిడ్ గా కనిపిస్తున్న అఖిల్ లుక్ చూస్తుంటే ఈ సినిమాతో కూడా మంచి హిట్ కొట్టేలాగా ఉన్నారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాని ఆగస్టు 12వ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Akhil Akkineni, Dil Raju, Akhil, Akkineni Akihil, Tollywood, Venu Sriram-

ఇకపోతే ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే అఖిల్ మరో డైరెక్టర్ కి సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత నటించిన వకీల్ సాబ్ సినిమాతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు వేణు శ్రీరామ్ తాజాగా అఖిల్ కు కథను వివరించగా ఆ కథ అఖిల్ కు బాగా నచ్చడంతో వేణు శ్రీరామ్ కు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఇకపోతే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా రాబోతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరి అఖిల్ తన తదుపరి సినిమా గురించి వస్తున్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే త్వరలోనే ఈ వార్తలకు సంబంధించి అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube