చాలామంది నటీనటులు యాంకర్స్ సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ ప్రపంచం అని నమ్ముతారు అంతేకాదు గ్లామర్ ఉన్నంతవరకే తమకు అవకాశాలు వస్తాయని బలంగా నమ్మేవారు కూడా ఉన్నారు గ్లామర్ తగ్గిపోతే లేదంటే వయసు మీద పడితే తమకు అవకాశాలు రావేమో అని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నాలు చేస్తూ రెండు చేతుల సంపాదించాలని ఆరాటపడుతూ ఉంటారు కానీ అదంతా తప్పు అని మీరు ఈ ఆర్టికల్ చివర్లో తెలుసుకుంటారు.
వయసు మీద పడుతున్న కూడా మన తెలుగు ఇండస్ట్రీ యాంకర్స్ కి మాత్రం రిటైర్మెంట్ లేదనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట.
ఏదోలా తొలినాల్లలో కష్టపడి అవకాశం సంపాదిస్తే చాలు ఇక్కడ యాంకర్స్ గా పాతుకపోవచ్చు అనేది ఇప్పుడున్న యాంకర్స్ ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.ఎందుకంటే ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్న యాంకర్స్ అందరూ కూడా దశాబ్దానికి పైగా యాంకరింగ్ చేస్తూ ఇక్కడే మళ్ళీ అవకాశాలు దక్కించుకుంటున్నారు.
ఉదాహరణగా నిత్యం బిజీగా ఉండే సుమ, ఝాన్సీ, ఉదయభాను లాంటి యాంకర్స్ పేర్లు కూడా ఒప్పుకోవచ్చు.

సుమ ఝాన్సీ అయితే 90వ దశకంలో ఇండస్ట్రీకి వచ్చిన వారే.ఒక ఏడాది అటు ఇటుగా వీరిద్దరూ ఒకేసారి టెలివిజన్లో రంగ ప్రవేశం చేశారు.రెండు దశాబ్దాలు గడుస్తున్నా వీరికి అవకాశాలకు కొదవేమీ లేదు.
ఇక ఇద్దరు పిల్లలకు తల్లైన ఉదయభాను, అనసూయ లాంటి వారు కూడా దాదాపు దశాబ్దం క్రితమే ఇండస్ట్రీకి వచ్చిన వారికి కూడా ఇప్పటికీ సినిమా అవకాశాలతో పాటు బుల్లితెరపై కూడా అనేక అవకాశాలు ఉన్నాయి.

ఇక జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ కొత్త కొత్త టెలివిజన్ షోస్ పెడుతూ పాత యాంకర్ తోనే నెట్టుకొస్తున్నారు.సో దీన్ని బట్టి చూస్తే మీకేం అర్థం అవుతుంది వయసు ఎంత ఉందని కాదు ఎంత ఎంటర్టైన్ చేస్తున్నామనేదే ముఖ్యం అందుకే సోషల్ మీడియా నుంచి ఎంతమంది స్టార్స్ వచ్చినా కూడా తమ స్థానానికి డోకా లేదని కాన్ఫిడెంట్ గా ఉన్నారు నిన్నటి మొన్నటి తరం యాంకర్స్.







