తెలంగాణ పై అదిరిపోయే ప్లాన్ తో రంగంలోకి కేంద్ర మంత్రులు ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ పై పట్టు సాధించేందుకు బిజెపి చేయని ప్రయత్నాలు లేవు.ఇప్పటికే కేంద్ర బిజెపి పెద్దలు తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

దీనిలో భాగంగానే కేంద్ర మంత్రులు,  బిజెపి కీలక నాయకులు తరచుగా తెలంగాణలో పర్యటిస్తూ టిఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ రాజకీయవేడిని మరింత పెంచే పనిలో పడ్డారు.ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు, అమిత్ షా వివిధ రాష్ట్రాల బిజెపి పాలిత ముఖ్యమంత్రులు హాజరయ్యారు.ఈ సమావేశాలకు భారీగా జన సమీకరణ చేపట్టడంలో సక్సెస్ కావడంతో తెలంగాణ బీజేపీ నాయకుల్లో మరింత ఉత్సాహం పెరిగింది.

అయితే ఇదే రకమైన స్పీడును మరింతగా పెంచాలని కేంద్ర బిజెపి పెద్దలు నిర్ణయించుకోవడంతో ఇప్పుడు వరుసగా కేంద్ర మంత్రుల పర్యటనలు తెలంగాణకు ఖరారు అవుతున్నాయి.  తెలంగాణలోని ప్రతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో కేంద్ర మంత్రులు పర్యటనలు చేయడమే కాకుండా, రెండు రోజులు అక్కడే మకాం వేసే విధంగా వ్యూహం రచించారు.

Advertisement

ఆ సందర్భంగా భారీ ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించబోతున్నట్టు, అలాగే కేంద్ర మంత్రులు నేరుగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించబోతున్నట్లు బిజెపి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.బిజెపి ప్రభావం జనాల్లో మరింత కనిపించేలా చేయాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. 

పార్టీ లోక్ సభ ప్రవాస్ యోజన లో భాగంగా రాష్ట్రాన్ని నాలుగు క్లస్టర్లుగా విభజించినట్టు  ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి తెలిపారు.కేంద్రం మత్స్య శాఖ మంత్రి పర్షోత్తం ఖోడా బాయ్ రూపాల అదిలాబాద్ క్లస్టర్ కు ఇన్చార్జిగా వ్యవహరిస్తారు.పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకటేష్ జోషి హైదరాబాద్ క్లస్టర్ కు ఇంచార్జిగా వ్యవహరిస్తారని, మహబూబ్ నగర్ క్లస్టర్ కు ఇన్చార్జిగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే, ఈశాన్య ప్రాంత  సహాయ మంత్రి బీఎల్ వర్మ వరంగల్ క్లస్టర్ లో పార్టీ కార్యక్రమాలకు సారథ్యం వహించనున్నారు.

అదేవిధంగా వరుసగా కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటిస్తూ ఎన్నికల నాటికి బిజెపి ప్రభావం స్పష్టంగా తెలంగాణ పై కనిపించే విధంగా వ్యూహాలను రూపొందిస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు