సినీ ఇండస్ట్రీలో తాజాగా మరొక విషాదం చోటు చేసుకుంది.ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి తాజాగా అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచారు.
తాజాగా జులై 5వ తేదీన హైదరాబాదులోని తన నివాసంలో ఆయన అనారోగ్యం కారణంతో కన్నుమూశారు.దీనితో ఒక్కసారిగా ఆయన కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది.
గుడిపూడి శ్రీహరి మరణం పట్ల పలువురు సినీ తారలు సంతాపం వ్యక్తం చేశారు.గుడిపూడి శ్రీహరి మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు.
అయితే ఆయన మృతి పట్ల పలువురి స్నేహితురాలు సంతాపం వ్యక్తం చేయగా మెగాస్టార్ చిరంజీవి ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఈ క్రమంలోనే శ్రీహరి గారి మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరని లోటు అనే మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.
అలాగే గుడిపూడి శ్రీహరి గారు ఒక నిఖార్సయిన నిబద్ధత కలిగిన ఒక సినీ విమర్శకుడని, చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు పై రాసిన ఆరోగ్యకరమైన విమర్శలు తనకి కి ఎప్పటికప్పుడు మెరుగ్గా మలుచుకోవడానికి ఎంతో ఉపకరించాయి అని తెలిపారు చిరు.ఆయన మృతి పట్ల ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను అని చిరంజీవి ట్వీట్ చేశారు.
కాగా ఇటీవలే చిరంజీవి ఒక కార్యక్రమంలో గుడిపూడి శ్రీహరి గురించి మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.
అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.నెటిజన్స్ ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గుడిపూడి శ్రీహరి గారికి నివాళులు అర్పిస్తున్నారు.ఇటీవల ఒక కార్యక్రమంలో చిరంజీవి గుడిపూడి శ్రీహరి గురించి మాట్లాడుతూ.
నా నట జీవితాన్ని సరైన మార్గంలో పెట్టిన వారిలో గుడిపూడి శ్రీహరి అలాగే పి ఎస్ ఆర్ ఆంజనేయ శాస్త్రి,నందగోపాల్ తదితర జర్నలిస్టులో ఉన్నారు.సినిమా సెట్లు వారితో చర్చించి నేను ఎన్నో రకాల విషయాలను నేర్చుకునే వాడిని.
కానీ ఆరోగ్యకరమైన జర్నలిజం అంటే ఏంటో వారి దగ్గరే తెలుసుకున్నాను అని చెప్పుకొచ్చారు చిరంజీవి.