హృతిక్ రోషన్ తీసిన మూవీ ధూమ్ సినిమా మీరు చూసే ఉంటారు.ఇందులో హీరో చేసే తెలివైన దొంగతనాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి.
అయితే ఈ సినిమా చూసి కొందరు ఇన్స్‌స్పైర్ అయ్యి తాజాగా ఓ స్కూల్‌లో చోరీ చేశారు.అంతేకాదు ధూమ్ 4 రాబోతోందని ఒక హెచ్చరిక కూడా చేశారు.
దమ్ముంటే తమని పట్టుకోండి అని ఫోన్ నంబర్లు ఇచ్చి మరీ పోలీసులకు సవాల్ చేశారు.ఇప్పుడు ఏ చోరీ స్థానికంగానే కాదు దేశ వ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
వివరాల్లోకి వెళితే.శుక్రవారం రాత్రి ఒడిశాలోని నవరంగ్‌పుర్‌లోని ఓ స్కూల్‌లో దొంగలు పడ్డారు.వీరు ఖరీదైన కంప్యూటర్లు, జెరాక్స్ మెషిన్లు, ప్రింటర్లు చోరీ చేశారు.ఇదంతా దొంగతనంలో జరగడం రొటీన్.
అయితే రొటీన్ కానిదేంటంటే ఈ దొంగలు ఒక బ్లాక్ బోర్డుపై “మేము ధూమ్.త్వరలోనే ధూమ్-4 చూపించబోతున్నాం.
ఇవిగో మా ఫోన్ నంబర్లు.దమ్ముంటే పట్టుకోండి” అని రాశారు.
దీంతో ఇది చూసిన వారంతా అవాక్కవుతున్నారు.
పూరీ జగన్నాథుని రథయాత్ర వేళ శుక్రవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇచ్చారు.

అయితే ఇదే అదునుగా భావించిన దొంగలు శుక్రవారం నాడే అన్ని ప్లాన్ చేసుకొని ఆ రాత్రి చోరీ చేశారు.అయితే శనివారం ఉదయం వచ్చిన ప్యూన్ కి ప్రిన్సిపాల్ రూమ్ డోర్ ఓపెన్ అయి ఉండటం కనిపించింది.దాంతో అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు.వెంటనే హెడ్‌మాస్టర్‌కి ఈ విషయాన్ని తెలిపాడు.దీంతో హెడ్‌మాస్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి వచ్చిన ఖతీగూడ పోలీసులు అన్నీ పరిశీలించారు.
ఈ దొంగలను పట్టుకునేందుకు సైంటిఫిక్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయం తీసుకుంటున్నారు.







