'రెక్కీ 360' టీజర్ విడుదల.. ఆద్యంతం ఉత్కంఠభరితం

స్నోబాల్ పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ “రెక్కీ 360”. శ్రీమతి సాకా ఆదిలక్ష్మి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని “కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు” అనే ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

 Hero Abhiram Recce 360 Movie Teaser Released Details, Hero Abhiram ,recce 360 Mo-TeluguStop.com

ఈ చిత్రానికి ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వం వహిస్తుండగా కమలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్ర్హున్నారు.ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా… క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇప్పటివరకు తన కెరీర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్రలో ఆయన కనిపించనున్నాడు.

ఇకపోతే ఈ క్రైం థ్రిల్లర్ లో అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్‌లో విడుదల చేయగా ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాంశానికి ఎవరూ ఊహించని కొన్ని ట్విస్టులు జోడించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

కాగా, ఈ రెక్కీ 360 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

కేవలం 54 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లోని ప్రతి సన్నివేశం కూడా ఉత్కంఠ రేపుతోంది.చిత్ర కథా నేపథ్యం ఎలా ఉంటుందో చెబుతూ ప్రతి ఫ్రేమ్ కూడా ఆసక్తికరంగా మలిచారు.

క్రైం నేపథ్యంలో సాగే ఈ కథలో ఊహించని ట్విస్టులు ఉంటాయని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది.ఇకపోతే ఈ రెక్కీ 360 మూవీ టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుందని మేకర్స్ అంటున్నారు.

ఈ చిత్ర రూపకల్పనలో ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ అందించిన మోరల్ సపోర్ట్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని మేకర్స్ పేర్కొన్నారు.పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి చేసుకుని, తుది మెరుగులు దిద్దుకుంటున్న “రెక్కీ 360” చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.ఈ చిత్రంలో నాగరాజు ఉండ్రమట్ట, దేవిచరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

సాంకేతిక వర్గం

సమర్పణ: శ్రీమతి సాకా ఆదిలక్ష్మి, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్, నిర్మాత: కమలకృష్ణ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, ప్రొడక్షన్ మేనేజర్: నాగార్జున, పబ్లిసిటీ డిజైనర్: శక్తి స్వరూప్, కెమెరా: వెంకట్ గంగాధరి, ఎడిటర్: కె.ఎల్.వై.పాపారావు, ఆర్ట్: రాజు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube