సీనియర్ నటుడు మురళీ మోహన్ చేతులమీదుగా ఘనంగా ప్రారంభమైన "అంతేనా..ఇంకేం కావాలి"

అమ్మ కిచ్చిన మాటను ,అమ్మాయి కిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకొన్నాడు అనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం “అంతేనా.ఇంకేం కావాలి”.

 Antena Inkem Kavali Started Grandly By The Hands Of Senior Actor Murali Mohan ,-TeluguStop.com

పవన్ కళ్యాణ్ బయ్యాను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ హై బ‌డ్జెట్‌తో శ్రీ వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై వెంకట నరసింహా రాజ్ దర్శకత్వంలో రవీంద్ర బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ” ఝాన్వీ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం రోజున హైద‌రాబాద్‌ లోని రామానాయుడు స్టూడియో లో సినీ అతిరధుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సీనియర్ నటులు మురళీ మోహన్ గారు హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నటుడు దగ్గుపాటి అభిరామ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.స్క్రిప్ట్ ను నటుడు ఘర్షణ శ్రీనివాస్ అందించారు.పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో.

నటుడు దగ్గుపాటి అభిరామ్ మాట్లాడుతూ.

వెంకట నరసింహ రాజ్ , రవీంద్ర బాబు లు మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీని ని సెలెక్ట్ చేసుకొని తీస్తున్న “అంతేనా.ఇంకేం కావాలి” సినిమా గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.

చిత్ర దర్శకుడు వెంకట నరసింహ రాజ్ మాట్లాడుతూ.

.ఈ కార్యక్రమానికి వచ్చిన మురళీ మోహన్ గారికి, దగ్గుపాటి అభిరామ్ గారికి ధన్యవాదములు.నేను వెంకటేష్ బాబు కు వీరాభిమానిని.

ఎప్పటికైనా వెంకటేష్ గారితో సినిమా చెయ్యాలనే పట్టుదల ఉండడంతో నా గురువుగారు ఆర్.నారాయణ మూర్తి ఆశీస్సులతో నేను డైరెక్టర్ అయ్యాను.ఈ బ్యానర్ లో ప్రస్తుతం “అల్లుడు బంగారం “సినిమా షూటింగ్ జరుగుతుంది.ఇప్పుడు చేస్తున్న “అంతేనా.ఇంకేం కావాలి” నా రెండవ సినిమా.ఈ సినిమా విషయానికి వస్తే ఇది తల్లీ కొడుకుల సెంటిమెంట్ ఉన్న సబ్జెక్టు , అమ్మ కిచ్చిన మాటను , అమ్మాయి కిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకొన్నాడు అనేదే ఈ కథాంశం.

మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ ని నిర్మాత రవీంద్ర బాబు తో కలసి ఈ సినిమా చేస్తున్నాను .నెక్స్ట్ మంత్ నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తున్న ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చే య డానికి ప్లాన్ చేస్తున్నాము .ఈ సినిమాలో సీనియర్ నటులు సుమన్,కమెడియన్ సునీల్, బ్రహ్మాజీ, కరాటే కళ్యాణ్,జబర్దస్త్ టీం ,గబ్బర్ సింగ్ టీం నటిస్తున్నారు.వీరితో పాటు ఇంకా చాలా మంది ఆర్టిస్టులకు అవకాశం కల్పిస్తున్నాము.

మాకు ఈ సినిమాకు మంచి టెక్నిషియన్స్ దొరికారు.ఫుల్ ఔట్ ఔట్ కామెడీ,ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు

Telugu Antenainkem, Jhanvi Sharma, Rabindra Babu, Seniormurali-Movie

చిత్ర నిర్మాత రవీంద్ర బాబు మాట్లాడుతూ.

ఇక్కడకు వచ్చిన , పెద్దలకు ధన్య వాదములు.వెంకట నరసింహ రాజ్ గారు నాకు ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ కథ చెప్పగానే ఈ కథ నాకు బాగా నచ్చింది.

తన ద్వారానే నేను నిర్మాతగా పరిచయ మవుతున్నాను.శ్రీ వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై మేమంతా కలసి నిర్మిస్తున్నాము.ఈ సినిమాకు మంచి నటీనటులు, టెక్నిషియన్స్ దొరికారు.కామెడీ, లవ్, సెంటిమెంట్ వంటి కథతో వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube