ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నాం.ప్యారిస్ లో కూతురు గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా.
సీఎం జగన్ దంపతులు కొద్ది రోజుల క్రితం వెళ్ళటం తెలిసిందే.కూతురు హర్ష డిస్టింక్షన్ లో ఉత్తీర్ణత సాధించటంతో జగన్ ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి గన్నవరం విమానాశ్రయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, జిల్లా ఉన్నతాధికారులు.స్వాగతం పలికారు.
అనంతరం సీఎం దంపతులు విమానాశ్రయం నుండి రోడ్డు మార్గం గుండా తాడేపల్లి లోని నివాసానికి చేరుకున్నారు. దాదాపు రెండు రోజులపాటు ఈ పర్యటన చేపట్టడం జరిగింది.
ఇదిలా ఉంటే రేపు 125వ అల్లూరి జయంతి వేడుకలలో ప్రధాని మోడీతో పాటు సీఎం జగన్ పాల్గొనబోతున్నరు.







