రానా.సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో వచ్చిన విరాటపర్వం సినిమా ఇటీవలే థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.కాని వసూళ్లు మరీ దారుణంగా నమోదు అయ్యాయి.ఏమాత్రం ఆశాజనంగా వసూళ్లు రాకపోవడంతో వెంటనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తూ ఉన్నారు.థియేటర్ల ద్వారా చూసిన వాళ్ల కంటే రెండు రెట్ల మంది ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ద్వారా చూసినట్లుగా తెలుస్తోంది.
సినిమా ను ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూస్తున్నారు.ఈ సినిమా కు సంబంధించినంత వరకు పెద్ద మైనస్ గా క్లైమాక్స్ ను భావిస్తున్నారు.
చివర్లో స్వయంగా రానా చేతిలో సాయి పల్లవి చనిపోవడం ను ఏ ఒక్కరు జీర్ణించుకోలేక పోతున్నారు.మరీ ఇలాంటి క్లైమాక్స్ లను తెలుగు ప్రేక్షకులు తట్టుకోలేరు.ఈ కథ కు ఆ క్లైమాక్స్ మాత్రమే సెట్ అనేది వేణు ఉడుగుల తో పాటు ప్రతి ఒక్కరి అభిప్రాయం.సినిమా చూసిన వారు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాని పాజిటివ్ గా సినిమా ముగిసి ఉంటే బాగుండేది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
![Telugu Venu Udugula, Netflix, Rana, Rana Daggubati, Sai Pallavi, Virataparvam-Mo Telugu Venu Udugula, Netflix, Rana, Rana Daggubati, Sai Pallavi, Virataparvam-Mo](https://telugustop.com/wp-content/uploads/2022/07/rana-sai-pallavi-movie-virataparvam-ott-talk-detailsa.jpg )
అలా జరగకుండా ఉంటే సినిమా ఖచ్చితం గా మంచి వసూళ్లు నమోదు చేసేది అంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాని సినిమా కథే అది అవ్వడం వల్ల మొత్తానికి సినిమా ను అలా ప్లాన్ చేయాల్సి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.విరాట పర్వం ఒక అద్బుతమైన దృష్య కావ్యం అనేది చాలా మంది బలం గా చెబుతున్న మాట.అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తూ ఉండాలి.ఈ సినిమా లకు ఆధరణ దక్కాలి అనే వారు కూడా చాలా మంది ఉన్నారు.