'హ్యాపీ బర్త్ డే' లో డిఫరెంట్ కామెడీతో పాటు సరికొత్త ప్రపంచం చూస్తారు: దర్శకుడు రితేష్ రానా

స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర లో మత్తువదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్ టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన సర్రియల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ “హ్యాపీ బర్త్ డే”.జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర దర్శకుడు రితేష్ రానా మీడియాతో మాట్లాడారు.ఆయన పంచుకున్న “హ్యాపీ బర్త్ డే” చిత్ర విశేషాలివి.

 Happy Birthday Director Ritesh Rana Interview , Happy Birthday Movie , Director-TeluguStop.com

‘మత్తువదలరా’ టెక్నికల్ టీమ్ నే “హ్యాపీ బర్త్ డే” లో కొనసాగించడానికి కారణం ?


టెక్నికల్ టీమ్ అంతా పదేళ్ళుగా ప్రయాణిస్తున్నాం.అదే టీమ్ వుంటే ఒక సౌకర్యం వుంటుంది.ఒకరిని ఒకరం అర్ధం చేసుకుంటాం.టీమ్ లో మంచి సింక్ ఉన్నపుడు బెస్ట్ అవుట్ పుట్ వస్తుందని నమ్ముతాను.

సర్రియల్ కామెడీ అనే ఆలోచన ఎలా పుట్టింది ?


ప్రస్తుతం మన సమాజంలో గన్స్ లీగల్ కాదు.అందరి దగ్గర గన్స్ వుండటం కష్టం.అందుకే ఒక ఫేక్ వరల్డ్ క్రియేట్ చేద్దామనే ఆలోచన.సర్రియల్ కామెడీ అనే జోనర్ వుంది.కానీ తెలుగులో ఇప్పటి వరకూ రాలేదు.

ఖచ్చితంగా కొత్తగా వుంటుందనిపించింది.ఐతే ప్రేక్షకులకు ఎలాంటి సందేహాలు ఉండకుండా ఈ సినిమా జోనర్ గురించి ప్రొమోషనల్ మెటిరియల్ లో ముందే వివరంగా చెప్పాం.

కథ మొత్తం లాజికల్ గానే వుంటుంది.అయితే కథ జరిగే ప్రపంచం ఊహజనితంగా వుంటుంది.

ఇలాంటి సినిమాలు ఇది వరకు వచ్చాయా ? ఏదైనా ప్రేరణ ఉందా ?



ఇలాంటి జోనర్ సినిమా రాలేదు.స్క్రీన్ ప్లే మాత్రం నాన్ లీనియర్ గా చేశాం.

క్వెంటిన్ టరాన్టినో ‘ఫుల్ప్ ఫిక్షన్’ తరహాలో స్క్రీన్ ప్లే వుంటుంది.కథ చాప్టర్ వైజ్ వెళుతుంటుంది.

ట్రైలర్ చూసిన చాలా మందికి అర్ధం కాలేదనే మాట వినిపిస్తుంది ?


ట్రైలర్ ఆసక్తికరంగా వుండాలి కథ అర్ధం కాకూడదనే ఉద్దేశంతోనే ట్రైలర్ కట్ చేశాం.ఈ కథ ఎలాంటి ప్రపంచంలో జరుగుతుందనేది చెప్పి, పాత్రలని పరిచయం చేశాం.కథ ఏమిటనేది సినిమా చూస్తే అర్ధమౌతుంది.

‘మత్తువదలరా’లో చేసిన నరేష్, సత్య, వెన్నెల కిషోర్ .హ్యాపీ బర్త్ డే లో తీసుకోవడానికి కారణం ?


మా అందరి మధ్య మంచి సింక్ కుదిరింది.అలాగే ఈ పాత్రలకు వారే యాప్ట్.

గన్స్ మీద కథ చేశారు కదా .ఎన్ని రకాల గన్స్ వాడారు ?


దాదాపు అన్ని రకాల గన్స్ వాడాం.సెల్ ఫోన్స్ ఎలా అయితే కలర్స్ లో దొరుకుతున్నాయో అలా కలర్ ఫుల్ గా గన్స్ ఉండాలనే ఆలోచన తో డిఫరెంట్ కలర్స్ లో గన్స్ తయారు చేశాం.రెంట్ లో వచ్చే గన్స్ అన్నీ దాదాపుగా వాడేశాం.

ట్రైలర్ లో రాజశేఖర్ పోస్టర్ చూపించడానికి కారణం ?


రాజశేఖర్ గారి సినిమా పేరు ఆయుధం.సినిమాలో రైతు బజార్ లా గన్ బజార్ ని మినిస్టర్ పెడతారు.

గల్లీగల్లీకి గన్ బజార్ వుంటుంది.ఆయుధం సేల్ అని కొంచెం ఫన్నీగా ఉండేలా పెట్టాం.

లావణ్య త్రిపాఠి ని ఎంపిక చేయడానికి కారణం ?


లావణ్య త్రిపాఠి గారు ఇలాంటి సినిమా చేయలేదు.ఆమె బయట చాలా జోవియల్ గా వుంటారు.

ఒక టీవీ షో లో తనని చూసి ఈ క్యారెక్టర్ రాశాను.ఈ పాత్ర ఆమెకు కొత్తగా వుండటంతో పాటు సరిగ్గా నప్పింది.

ఈ కథని లావణ్య త్రిపాఠి లీడ్ చేస్తారు.మిగతా పాత్రలన్నీ ముఖ్యమే.

ఇలాంటి కథలు ఓటీటీకి బావుంటాయా ? థియేటర్ కా ?


థియేటర్ ఎక్సపిరియన్స్ కి బావుంటాయి.ఈ సినిమా థియేటర్ కోసమే తీశాం.300 వందల మంది కలసి నవ్వుకోవడంలో ఓ కిక్ వుంటుంది.తర్వాత ఓటీటీలో కూడా వర్క్ అవుతుంది.

మత్తువదలరా లో ఒక కొత్త తరహా కామెడీ చూపించారు ? ఇందులో ఎలాంటి కొత్తదనం వుంటుంది ?

హ్యాపీ బర్త్ డే చాప్టర్ వైజ్ వుంటుంది.కామెడీలో వున్న జోనర్స్ అన్నీ ఒకొక్క చాప్టర్ లో టచ్ చేశాం.

ఏడు చాప్టర్లు వుంటే.విజువల్ కామెడీ, వ్యంగ్యం, పేరడీ, ఇలా ఒకొక్క చాప్టర్ లో ఒక్కో తరహా కామెడీ ప్రయత్నించాం.

మ్యూజిక్ కి ఎంత ప్రాధాన్యత వుంది ?


చాలా ప్రాధన్యత వుంది.సినిమా చాలా క్రేజీ గా తీశాం.

మ్యూజిక్ డబుల్ క్రేజీ గా ఇచ్చారు కాల భైరవ.

పాన్ తెలుగు సినిమా అన్నారు కదా ? పాన్ ఇండియా పై సెటైరా ?


సెటైర్ కాదండీ.ప్రమోషన్స్ లో సరదాగా నవ్వుకోవడానికి అలా పెట్టాం.సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగులో రిలీజ్ అవుతుందని చెప్పడానికి అలా సరదాగా పాన్ తెలుగు సినిమా అన్నాం.

కామెడీ అన్ని చోట్ల వర్క్ అవుట్ అవుతుంది కదా .మిగతా బాషల్లో ఎందుకు ప్రయత్నించలేదు.?


కొన్ని నటులని బట్టి వుంటుంది.సత్య, వెన్నెల కిషోర్ మనకి బాగా తెలిసిన నటులు.

హిందీలో ఎలా వుంటుందో తెలీదు.తెలుగు అనుకునే ఈ సినిమా చేశాను.

చాలా పాత్రలు వున్నపుడు కన్ఫ్యూజన్ వుంటుంది కదా .దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు ?


ఎక్కువ పాత్రలు వున్నపుడు కాస్త కన్ఫ్యూజన్ వచ్చే మాట వాస్తవమే.స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ గా వుండటంలో కూడా ఇది వస్తుంది.అయితే సినిమా చూసినప్పుడు మాత్రం ఎలాంటి కన్ఫ్యూజన్ వుండదు.ఇది చాలా టిపికల్ స్క్రీన్ ప్లే.

ఇందులో చాలా పాత్రలు వున్నాయి కదా ఎవరు ఎక్కువగా హైలెట్ అవుతారని భావిస్తున్నారు ?


అందరూ హైలెట్ అవుతారు.అందరికీ సమాన ప్రాధన్యత వుంటుంది.అయితే లావణ్యని ఇప్పటివరకూ ఇలాంటి పాత్రలలో చూడలేదు కాబట్టి ఆమె పాత్ర ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం వుంటుందని భావిస్తున్నా.ఆమెకు మంచి ప్రశంసలు దక్కుతాయని అనుకుంటున్నాను.

Telugu @satya, Ritesh Rana, Riteshrana, Guns Colors, Happyritesh, Happy, Naresh,

హ్యాపీ బర్త్ డే టైటిల్ గురించి ?


ఇందులో లావణ్య గారి పేరు హ్యాపీ.ఆమె బర్త్ డే రోజు కథలో కీలక అంశాలు జరుగుతాయి కాబట్టి హ్యాపీ బర్త్ డే అని పెట్టాం.

డిఫరెంట్ జోనర్స్ ఎంచుకోవడానికి కారణం ?


మత్తువదలరా లిమిటెడ్ బడ్జెట్ లో చేసి ఒక ఎంట్రీ కార్డ్ గా నన్ను నేను నిరూపించుకోవడానికి చేశా.ఇది విజయం సాధించింది.నాకు ఎప్పుడూ కొత్తగా రాయాలనే వుంటుంది.హ్యాపీ బర్త్ డే కూడా డిఫరెంట్ కథ.నిర్మాతలకు చాలా నచ్చింది.

ప్రయోగాత్మక చిత్రాలు చేస్తారా ? కమర్షియల్ సినిమాలు చేసే ఆలోచన ఉందా ?


హ్యాపీ బర్త్ డే కూడా కమర్షియల్ సినిమానే,.గన్స్ ఫైట్స్ పాటలు అన్నీ వున్నాయి( నవ్వుతూ).అయితే ఒక ఫార్ములా కాకుండా కొంచెం వైవిధ్యమైన ప్రజంటేషన్ వుంటుంది.

మత్తువదలరా విజయం తర్వాత చాలా అవకాశాలు వచ్చుంటాయి కదా.మళ్ళీ మైత్రీ మూవీ మేకర్స్ తోనే చేయడానికి కారణం ?


మైత్రీ మూవీ మేకర్స్ తో పని చేయడం చాలా సౌకర్యంగా వుంటుంది.నా స్టయిల్ వాళ్లకి తెలుసు.సినిమాపై మంచి ప్యాషన్ వున్న నిర్మాతలు.

కొత్త సినిమాలు గురించి ?


రెండు కథలు లాక్ అయ్యాయి.ఇవి కూడా చాలా కొత్తగా వుంటాయి.ఏది ముందు సెట్స్ పైకి తీసుకెళ్ళాలో ఇంకా డిసైడ్ కాలేదు.

ఆల్ ది బెస్ట్


థాంక్స్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube