బిగ్ బాస్ బ్యూటీ నటి హిమజ గురించి మనందరికీ తెలిసిందే.తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హిమజ ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకొని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగింది.అప్పుడప్పుడు హిమజ బుల్లితెరపై సందడి చేస్తూ వెండితెరపై సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.
ఇక ఇది ఇలా ఉంటే హిమజ ఇప్పటికే పలు సార్లు తన పెళ్లి విషయం గురించి మాట్లాడిన విషయం తెలిసింది.
తాజాగా మరొకసారి పెళ్లి గురించి స్పందించింది హిమజ.
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే తాజాగా అస్క్ మీ క్వశ్చన్ లో భాగంగా తన ఫ్యాన్స్ తో ముచ్చటించింది హిమజ.
ఈ క్రమంలోనే తన ప్రొఫెషనల్ లైఫ్ తో పాటుగా పర్సనల్ విషయాలను కూడా పంచుకుంది.ఇక అప్పుడు ఒక వ్యక్తి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అక్కాయ్ ప్లానింగ్ చేసుకున్నావా లేదా అని అడగగా ఆ విషయం పై స్పందించిన హిమజ.
పెళ్లి లేదు ఏం లేదు పెళ్లి ఇంట్రెస్ట్ లేదని తెలిసి చెప్పేసింది.
![Telugu Bigg Boss, Himaja, Tollywood-Movie Telugu Bigg Boss, Himaja, Tollywood-Movie]( https://telugustop.com/wp-content/uploads/2022/07/bigg-boss-telugu-3-fame-himaja.jpg)
అయితే మరి పెళ్లి చేసుకుంటే ప్రశాంతత ఫ్రీడమ్ ఉండదు అనుకుంటుందో ఏమో కానీ పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు నాకు పీస్ అండ్ ఫ్రీడమ్ కావాలి అని అంటుంది హిమజ.మొత్తానికి తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని క్లారిటీ ఇచ్చింది.అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకోదా లేకపోతే ఎప్పటికీ పెళ్లి చేసుకోదా అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.
ఆమధ్య ఒకసారి తన తల్లి స్టేజ్ పై అందరి ముందు అడిగినా తనకు కొంచెం టైం కావాలి అని అడిగిన విషయం తెలిసిందే.పెళ్లి గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి హిమజ తన అభిమానులను నిరాశ పరుస్తోంది.
కాగా ఇటీవల సోషల్ మీడియాలో హిమజకు ఇంతకుముందే పెళ్లయింది అని, 2012లో రాజేష్ ఆనందన్ అనే బిజినెస్ మ్యాన్ తో హిమజకు పెళ్లి అయ్యిందని.ఆ తరువాత పెళ్లి గోల ఏమైందో తెలియదు కానీ మరి కొద్దిరోజుల తర్వాత హిమజ చల్లా విజయ్ రెడ్డి అనే వ్యక్తిని వివాహమాడినట్లు మరొక గాసిప్ వినిపించింది.
ఇలా ఇప్పటికే హిమజ పెళ్లి విషయంలో లవ్ విషయంలో ఎన్నో గాసిపులు వినిపించాయి.