వంగవీటి రంగా జపం చేస్తున్న గంటా.. వ్యూహం మారిందా?

రాజకీయాల్లో వంగవీటి మోహన రంగా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.ఆయన పేరు వింటేనే శరీరంలో వైబ్రేషన్ పుడుతుంది.

కాపులకు ఆయన ఆరాధ్య దైవం.దానికి మించి ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసి విజయవాడలో పేరు తెచ్చుకున్నారు.

ఇక ఆయన మరణించి ఇప్పటికీ 34 ఏళ్లు దాటినా కూడా ఇంకా స్మరిస్తూనే ఉన్నారు.ప్రత్యేకించి ఏపీ రాజకీయాల్లో సామాజిక సమీకరణలలో వంగవీటి ప్రస్థావన వస్తూనే ఉంటుంది.

ముఖ్యంగా 1980 దశకంలో వంగవీటి రంగా ఒక ప్రభంజనం అని చెప్పుకోవాలి.ఆ సమయంలో ఆయన కోస్తా జిల్లాలను ఊపేశారు.నాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని గడగడలాడించిన నాయకుడు.1985లో కాంగ్రెస్ పార్టీని ఎదురించి తన హవా చూపించి అధికారంలోకి వచ్చిన టీడీపీని విజయవాడలో రంగా అనే శక్తి నిలువరించింది.మూడేళ్ల పాటు రంగా వర్సెస్ టీడీపీ పోరాటం కొనసాగింది.

Advertisement

ప్రస్తుతం రంగా వారసులుగా చాలా మంది ఎదిగేందుకు ప్రయత్నాలు చేసినా కూడా ఆ చేరువకు కూడా రాలేకపోతున్నారు.అయితే ప్రస్తుతం మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం రంగా జపం చేస్తున్నారు.

వంగవీటి మోహన రంగా 75వ జయంతి వేడుకలను జూలై 4న విశాఖలో ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.విజయవాడ, హైదరాబాద్ నగరాలలో కూడా ఆ రోజున రంగా జయంతి వేడుకలు జరుగుతాయని గంటా స్పష్టం చేశారు.

ఇటీవల పాయకరావుపేటలో రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన వేళ ఈ రాష్ట్రానికి కాబోయే సీఎం కాపుల నుంచే వస్తారని గంటా సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అయితే గంటా తన వ్యూహం మార్చారని.ఆయన రంగా నామస్మరణ చేస్తుండటం వెనుక కాపులను టీడీపీ వైపు రప్పించి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలన్న తాపత్రయం కనిపిస్తోందని ఆయన సన్నిహితులు వివరిస్తున్నారు.కోస్తా జిల్లాలో అతి ప్రధాన వర్గంగా పెద్ద వర్గంగా ఉన్న కాపులను టీడీపీకి సానుకూలం చేసే బాధ్యతను గంటా తీసుకున్నారని చెప్తున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

మరోవైపు రంగా పేరిట గంటా మరోమారు ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు రంగం సిద్ధం చేస్తున్నారా అన్న విషయంపైనా చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు