సలార్ సినిమాలో యశ్ కూడా కనిపిస్తారా.. షాకింగ్ విషయాలు రివీల్!

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండగా మేకర్స్ ఈ వార్తల గురించి స్పందించడం లేదు.

 Shocking Rumours Goes Viral About Prabhas Prashant Neel Movie , Prabhs, Salaar,-TeluguStop.com

అయితే సలార్ మూవీలో యశ్ కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.అయితే యశ్ ఈ సినిమాలో నటించడం లేదని కేజీఎఫ్2 సినిమాలోని సీన్ ను సలార్ లో వినియోగించుకోనున్నారని తెలుస్తోంది.

వైరల్ అవుతున్న వార్త సలార్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.విక్రమ్ సినిమాలో ఖైది రెఫరెన్స్ ను వాడుకున్న విధంగానే సలార్ సినిమాలో కేజీఎఫ్2 రెఫరెన్స్ ఉంటుందని తెలుస్తోంది.వైరల్ అవుతున్న వార్త అటు ప్రభాస్ అభిమానులకు ఇటు యశ్ అభిమానులకు కిక్ ఇచ్చేలా ఉండటం గమనార్హం.300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాకు ఊహించని స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి.

సలార్ సినిమా నుంచి ఇప్పటికే లీకైన ఫోటోలు ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను ఏ విధంగా చూపించబోతున్నారో ప్రేక్షకులకు తెలిసేలా ఉన్నాయి.బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేసే సినిమాగా సలార్ నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సాధారణ ఆడియన్స్ దృష్టిని కూడా సలార్ సినిమా ఆకర్షిస్తుండటం గమనార్హం.ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది.

Telugu Prabhas, Prahsant Neel, Prashant Neel, Rumours, Vikram, Yash-Movie

ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో హిట్ టాక్ వస్తే ప్రభాస్ దూకుడుకు బ్రేక్ వేయడం ఎవరికీ సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ సినిమాలన్నీ 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న నేపథ్యంలో ప్రభాస్ తర్వాత సినిమాలతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube