సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు.ఇలా ఒక సినిమాలో కలిసి ఇద్దరు నటించిన తర్వాత అదే సినిమాతోనే ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకున్న వారు ఉన్నారు.
ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య జ్యోతిక ఒకరు.ఇక సూర్య జ్యోతికకు కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది.
సూర్య ఇప్పటివరకు తెలుగులో పూర్తిస్థాయి సినిమా చేయకపోయినా ఆయన సినిమాలకు తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంది.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య జ్యోతికతో తొలి పరిచయం గురించి బయటపెట్టారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.వసంత్ డైరెక్షన్లో ‘పోవేళ్ళం కేట్టుప్పర్‘ అనే సినిమాలో జ్యోతిక తాను మొదటిసారిగా కలిశామని, వసంత్ మా ఇద్దరిని కలిపారని ఈ సందర్భంగా సూర్య వెల్లడించారు.
ఈ సినిమాలో మొట్టమొదటి సన్నివేశం నేను జ్యోతిక చేయి పట్టుకొని లాంగ్ మార్చ్ చేయడం.అలా ఈ సినిమాతో మా ఇద్దరి పరిచయం ఏర్పడింది.
ఈ సినిమా తర్వాత మేం ఇద్దరం కలిసి మరో రెండు సినిమాలు చేశామని మేమిద్దరం కలిసి నటించిన మూడో సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా అదే సమయంలో జ్యోతిక ఫై కూడా ఎంతో ఇష్టం ఏర్పడి ఇద్దరం సీరియస్ గా ప్రేమించుకోవడం మొదలు పెట్టామని సూర్య తెలిపారు.

ఇక మా ప్రేమ విషయాన్ని మా సోదరి దగ్గర ప్రస్తావించగా ఆమె తల్లిదండ్రులను ఒప్పించారని సూర్య ఈ సందర్భంగా వెల్లడించారు.ఇకపోతే ఇద్దరిలో మొదట ఎవరు ప్రపోస్ చేశారు అనే విషయాన్ని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు సూర్య సమాధానం చెబుతూ మొదట తానే జ్యోతికకు ప్రపోస్ చేశానని ఈ సందర్భంగా సూర్య జ్యోతిక తో ఏర్పడిన తొలి పరిచయం వీరి ప్రేమ గురించి తెలిపారు.ఇకపోతే సూర్య తాజాగా కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.