ఆ దిండు ఖరీదు అక్షరాలా రూ.45 లక్షలు.. షాక్ అవుతున్న కస్టమర్లు...

సాధారణంగా రోజంతా కాయకష్టం చేసి కాసిన్ని ఉడుకునీళ్లు పోసుకొని నులక మంచంపై పడుకోగానే క్షణాల్లోనే కార్మికులకు నిద్ర పడుతుంది.మళ్లీ ఉదయం సూర్య కిరణాలు వారిని గుచ్చుకునేంతవరకు వారికి మెలుకువ రాదు.

 The Worlds Most Expensive Pillow Costs 57k Dollars Details, Pillow, 45lakhs,vira-TeluguStop.com

ఆ స్థాయిలో వారికి గాఢ నిద్ర పడుతుంది.కానీ కోట్లకొద్దీ రూపాయలు, శయనించడానికి ఏసీ గదుల్లో మెత్తటి పరుపులు ఉన్నా కొందరికి నిద్ర పట్టదు.

నిద్రలేమి సమస్యను అధిగమించడానికి వీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అవుతుంటారు.కారణాలు ఏవైనా వీరు కంటినిండా హాయిగా కునుకు తీయలేక నరకం అనుభవిస్తారు.

అయితే తాజాగా ఇలాంటి వారి కోసం నెదర్లాండ్‌కు చెందిన ఒక ఫిజియోథెరపిస్ట్ ఒక ప్రత్యేకమైన దిండు తయారు చేశాడు.ధనవంతుల స్థాయికి తగ్గట్లుగానే దీనిని ఏకంగా 57 వేల డాలర్లుగా (రూ.45 లక్షలు) నిర్ణయించాడు.

రూ.45 లక్షలు అంటే మామూలు విషయం కాదు.ఈ డబ్బుతో నాలుగు మంచి కార్లు లేదా ఒక లగ్జరీ కారు కొనుగోలు చేయవచ్చు.

మరి ఒకేఒక దిండు వీటికి సమానమైన ధర ఎందుకు పలుకుతుంది? దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? దీనిపై తలపెట్టి పడుకుంటే ఎవరికైనా నిద్ర పడుతుందా? అనేవి సహజంగా అందరిలో వచ్చే ప్రశ్నలు.ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే.

ఈ దిండు అంత ఖరీదు ఉండటానికి ముఖ్య కారణం దానిలో గోల్డ్, డైమండ్స్ అందించడం.అలాగే ఈ దిండు తయారు చేయడానికి ఫిజియోథెరపిస్ట్ ఏకంగా 15 ఏళ్లు సమయం పాటు పరిశోధనలు చేయడం.

తన పరిశోధనకు వ్యాల్యూ కట్టడంతోపాటు ఇతడు ఈ గోల్డ్, డైమండ్స్‌కు కూడా విలువ కట్టి దీని కాస్ట్ నిర్ణయించాడు.

Telugu Lakhs, Golddiamonds, Netherlands, Pillow, Pillow Dollars, Latest, Worldse

వీటితోపాటు ఎవరికైనా సరే నిద్ర పట్టేలా ఈ దిండులో కాటన్‌ను రొబోటిక్ మిల్లింగ్ మిషన్ ద్వారా చక్కగా అల్లేసాడు.అలాగే ఒక నీలిరంగు రాయి కూడా అందించాడు.ఈ పిల్లోని నాలుగు ఖరీదైన డైమెండ్లు పొదగడం వల్లే దీనికింత ధర అని అతను చెబుతున్నాడు.

పిచ్చి కాకపోతే, భారీ మొత్తంలో డబ్బు వెచ్చించి దీనిని ఎవరు కొనుగోలు చేస్తారు? అని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.కానీ ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియనంత డబ్బు ఉన్న వారు వీటిని రెండో ఆలోచన లేకుండా కొనుగోలు చేయడం ఖాయం.

ఏది ఏమైనా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండుగా ఇది ఇప్పుడు సంచలనం సృష్టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube